జగన్‌పైకి ఆ కులస్తులను ఉసిగొల్పుతున్న బాబు?

టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాల్మీకి బోయాలను ఎస్సీ, ఎస్టీ లో చేర్చుతామని ఒక జీవో తీసుకొచ్చారు. ఇది గత ఎన్నికల సమయంలో వాల్మీకి, బోయాలకు ఇచ్చిన హామీ ప్రకారం జీవోను తెచ్చామని టీడీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ అది జీవోకు మాత్రమే పరిమితమైంది. అది పూర్తిగా అమలు కాలేదు.

ఎస్సీ , ఎస్టీలు రిజర్వేషన్లలో వేరే కులాలను చేర్చాలంటే అది అంత సులువైన విషయం కాదు. కేంద్ర ప్రభుత్వము దానిని అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆయా కులాలను ఎస్టీ లో చేర్చాలని  పంపిస్తున్న జీవోలను కేంద్రం అంగీకరించడం అంత ఈజీ కాదు. ఈ విషయం పూర్తిగా తెలుసుకోకుండా టీడీపీ పంపించాం మేము మా పని చేశాం అక్కడ కేంద్రం చేయలేదని చెప్పింది.

అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. గతంలో వాల్మీకి బోయాలకు ఎస్టీలో చేర్చాలని చెప్పి జీవో తీసుకువచ్చి చట్టం చేసింది  అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం.  కానీ అదే టీడీపీ ప్రస్తుతం ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారో వారిని రెచ్చగొట్టి ధర్నాలు నిరసనలు చేయిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎస్టీలలో వాల్మీకి, బోయాలను చేర్చకూడదని ప్రస్తుతం అదే టీడీపీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది జగన్ ప్రభుత్వం పై అటాకింగ్ గా కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం వాల్మీకి బోయలని ఎస్సీ ఎస్టీ లో చేర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఎస్సీ ఎస్టీలు గిరిజన సంఘాలను కలుపుకొని టీడీపీ ధర్నాలు నిరసనలు చేపడుతుంది.

ఇలా ధర్నాలు నిరసనలు చేయడం వల్ల జగన్ ప్రభుత్వం పై ఎస్సీ ఎస్టీలలో గిరిజన సంఘాలలో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా చేస్తూ జగన్ ప్రభుత్వం పై అటాకింగ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: