ఇండియాకు బ్యాడ్‌న్యూస్‌: చైనా మళ్లీ పుంజుకుంటోందా?

చైనా వైపు మళ్లీ యూరప్ దేశాలు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా టైంలో చైనాపై బ్యాన్ పెట్టిన దేశాలు మళ్లీ చైనా తో సంప్రదింపులు జరుపుతున్నాయి. జర్మనీ, ప్రాన్స్, దేశాల అధ్యక్షులు ఈ మధ్య చైనాలో పర్యటించారు. చైనాలో పర్యటనకు కారణం యూరప్ దేశాలు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఒక వేళ విద్యుత్ ను కొత్తగా తయారు చేయాలంటే కొన్ని వేల కోట్ల డబ్బులు అవసరం అవుతాయి.


కాబట్టి ఇప్పుడు అంతా డబ్బు కూడా యూరప్ దేశాలు పెట్టే పరిస్థితిలో లేవు. అందుకే చైనా తో మళ్లీ వ్యాపారాలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యుత్ ను ఆయా దేశాల్లో తయారు చేసుకుని అమ్మొచ్చు. కానీ ఎక్కువ ధరకు తయారు చేయాల్సి వస్తుంది. అదే చైనా నుంచి కొనుక్కుంటే తక్కువ ధరకు వస్తుంది. దాన్ని వేరే దేశాలకు కూడా ఎక్కువ డబ్బులకు అమ్ముకోవచ్చు.


చైనాకు వెళ్లి అక్కడ ఉన్న పాత సంస్థల్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త కొత్త సంస్థల్ని, వ్యాపారస్తుల్ని  తమ వెంట చైనాకు తీసుకెళుతున్నారు. మీ దేశంలో వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. చైనాలో ప్రభుత్వాలు మారవు. నియంత ప్రభుత్వం జిన్ పింగ్ శాశ్వత అధ్యక్షుడిగా  ఎన్నికయ్యారు. ప్రభుత్వాలు మారితే వ్యాపారాలు దెబ్బతింటాయనే ఉద్దేశం ఉండదు. కాబట్టి వ్యాపారాలకు ఎలాంటి ఢోకా ఉండదు.


రాబోయే కాలంలో రష్యా తో కూడా యూరప్, అమెరికా దేశాలు వ్యాపారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ యూరప్, అమెరికాలను నమ్ముకుని యుద్ధానికి దిగిన ఉక్రెయిన్ పరిస్థితే దారుణంగా తయారైంది. ఒక వేళ ఈ దేశాలు రష్యాతో కలిస్తే ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది. రష్యాతో  వ్యాపారాలు చేయవని గ్యారంటీ ఏంటీ.. ఉక్రెయిన్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంలా తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: