అమరావతి.. పేదలు లేని రాజధాని అవుతుందా?
అయితే దీనిపై ప్రభుత్వం, సీఆర్డీఏను కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. అయితే రాజధానుల భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ దేవరాత్ కామత్, లాయర్లు ఆంజనేయులు, ఉండం మురళిధర్ లు వాదనలు వినిపించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని అక్కడికి వెళ్లొచ్చు కదా అని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే కేవలం రాజధాని భూములు గురించి మాత్రమే మాట్లాడుతున్నామని న్యాయవాదులు అన్నారు.
అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటే అది రాజధాని కాకుండా పోతుందా అని ప్రజలు అంటున్నారు. లేదా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరికైనా అక్కడ ఇళ్లు ఇస్తే అదేమైనా నేరం కిందకు వస్తుందా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన సంస్థలకు అక్కడ బిజినెస్ చేసేందుకు భూములు ఇస్తున్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలకు మాత్రం ఇవ్వడానికి వెనక్కి వస్తున్నారు.
దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ విషయంపై ప్రజలు తీవ్ర నిరాశ, అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విధానాలు మానుకోవాలని సూచిస్తున్నారు. రాజధాని అంటే సంస్థలు, పెట్టుబడులే కాకుండా అక్కడ మనుషులు కూడా జీవిస్తారని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. మనుషులు జీవించికుండా అదెలా రాజధానిగా అభివృద్ది చెందుతుందని ప్రజలు, మేధావులు అడుగుతున్నారు.