పేల్చేస్తాం.. అమెరికాకు రష్యా వార్నింగ్?
రష్యన్ మాట్లాడే వాళ్ళ ప్రాంతంలో వాళ్లను వేధిస్తున్నందుకే మేము మిలటరీ ఆపరేషన్స్ చేస్తున్నాము. దీనిపై జోక్యం చేసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఫ్గనిస్తాన్ లో ఉన్న మీ వాళ్ళని ఎట్లా వెనక్కి తెచ్చుకున్నారో, ప్రపంచంలోని ఎక్కడైనా మీ వాళ్ళకి ప్రాబ్లం వస్తే మీరు ఎలా చూసుకుంటున్నారో మీరు దానికి ఉక్రెయిన్ ని అడ్డుపెట్టి, నా దేశం మీద కనక ఉక్రెయిన్ కి ఆయుధాలను ఇచ్చి దాడికి పంపిస్తే ఊరుకోను అని చెప్తున్నాడు రష్యా దేశపు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
ఇప్పుడు సీరియస్ పరిణామాలు వైపుకు తీసుకెళుతున్నాడు, ఎవరైతే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఎవరైతే అణ్వాయుధాల పక్కన ఫోటో దిగి ప్రపంచానికి చూపించాడో, అదే పద్ధతిలో రష్యా కూడా అలాంటి హెచ్చరికలే పరోక్షంగా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. 12 వేల కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను కూడా ఛేదించే అత్యాధునిక మరియు అత్యంత శక్తివంతమైన మిస్సైల్స్ తో యుద్ధ విన్యాసాలు చేయిస్తూ ప్రపంచానికి చూపిస్తుంది, ఇదిగో మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయంటూ.
ఒకరకంగా భయపెడుతుంది మరొక రకంగా చెప్పాలంటే కంటికి కునుకు లేకుండా చేస్తుంది అది. మా మీద ఎవరైనా ఎప్పుడైనా యుద్ధం చేయడానికి ప్రయత్నించినా, ప్రయత్నించాలని ఆలోచించినా, అటువంటి పరిణామాలు కనుక తీవ్రమైతే రష్యాలో కూర్చునే మా దగ్గర ఉన్న అత్యాధునిక మిస్సైల్స్ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్, అత్యాధునిక యుద్ధ విమానాలు ఇంకా అత్యాధునిక కొత్త సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న యుద్ధనౌకలతో అమెరికాని పేల్చేస్తామని పరోక్షంగా హెచ్చరించింది రష్యా.