ఉక్రెయిన్ను యూరప్ దేశాలు నట్టేట్లో ముంచాయా?
యూరప్ దేశాలు రష్యా పై విధించిన ఆర్థిక ఆంక్షలను పట్టించుకోకుండా గ్యాస్ ను రష్యా దేశం నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఉక్రెయిన్ కు తెలిసింది. దీంతో భారత్ గురించి జెలెన్ స్కీ గతంలో మాట్లాడుతూ.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారంటే మా రక్తంతో కొన్నట్లే అని అన్నారు. ప్రస్తుతం అవే వ్యాఖ్యలను యూరప్ పై చేస్తున్నారు.
పెట్రోల్, డిజీల్ ను యూరప్ దేశాలు కొనడం లేదు. కానీ అమెరికా, యూరప్ దేశాలు విధించుకున్న ఆంక్షలకు విరుద్దంగా గ్యాస్ ను కొంటున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ ను కొన్ని యూరప్ దేశాలు కొంటున్నట్లు పోలండ్ అధ్యక్షుడు ఈ మధ్య ఆరోపించారు. కానీ యూరప్ దేశాలు తమకేమీ తెలియనట్లు ఇన్ని రోజులు కపట నాటకాన్ని ప్రదర్శించాయి.
ఒక వైపు యుద్ధం చేయమని ఆయుధాలు ఇస్తూనే మరో వైపు రష్యా దగ్గరి నుంచి గ్యాస్ కొని ఆ దేశానికి ఆర్థికంగా సాయపడుతున్నాయి. ఇన్ని రోజులు భారత్ ఆయిల్ కొంటుందని దాన్ని ఎలా గైనా నియంత్రించాలని యూరప్ దేశాలు విశ్వ ప్రయత్నాలే చేశాయి. జీ20 సదస్సులో రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని పట్టుబడ్డాయి. భారత్ తన నిర్ణయాన్ని ఎక్కడా మార్చుకోలేదు. తటస్థంగా ఉంటామన్న మాటకు కట్టుబడి ఉంటోంది. యూరప్ దేశాల లాగా ముందు ఒక మాట చెప్పడం, దాన్ని చాటుగా చేయడం లాంటి నిర్ణయాలకు దూరంగా ఉంటోంది. భారత్ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టి చెబుతోంది.