"ఒకటే భజన ఎన్ని సంవత్సరాలు సార్".. రివర్స్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏమైందంటే..?
ఈ చిత్రానికి కెమెరా వర్క్ అందిస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కీలక అప్డేట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ మోడ్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే, ‘ఎన్టీఆర్ – నీల్’ సినిమాలో రాత్రి సమయంలో జరిగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని అర్థమవుతోంది.ఇదే కాకుండా, దీనికి ముందు కూడా భువన్ గౌడ పలు సందర్భాల్లో అప్డేట్స్ ఇచ్చారు. అప్పట్లో సినిమా షూటింగ్ మొదలుకాకముందు తాము వివిధ లొకేషన్లకు వెళ్లి లొకేషన్ రెక్కీ చేస్తున్నామని వెల్లడించారు. ఆ తరువాత మళ్లీ షూటింగ్ ప్రారంభమైందన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పుడు నైట్ షూట్ అప్డేట్‌తో సినిమాపై మరోసారి ఆసక్తి పెరగాల్సింది పోయి, కొంతమంది నెటిజన్లు దీనిని ట్రోలింగ్‌కు ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల్లోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. “సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికే ఎన్నేళ్లు గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ సినిమాకు సంబంధించి క్లియర్ అప్డేట్ ఒక్కటి కూడా లేదు. ఎన్ని రోజులు ఇదే మాట, ఇదే లొకేషన్ భజన చేస్తారు? ఫ్యాన్స్‌ను ఇలా మోసం చేయడం ఎంతవరకు న్యాయం?” అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు.ప్రశాంత్ నీల్ సినిమాలు టైమ్ తీసుకుని, పర్ఫెక్షన్‌తో తెరకెక్కిస్తాడన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, సరైన అధికారిక అప్డేట్స్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్‌లో అసహనం పెరుగుతోంది. ఇకనైనా మేకర్స్ స్పష్టమైన సమాచారం ఇచ్చి, అభిమానుల అంచనాలకు తగిన విధంగా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే..!