చక్రం తిప్పిన అమిత్ షా.. తమిళనాడులో విజయ్ తో బీజేపీ పొత్తు..!

Pandrala Sravanthi
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉంది అంటే అది ఇదే..ఎప్పుడైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించారో అప్పటినుండి తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతుంది. అదేంటంటే.. బిజెపితో విజయ్ టీవీకే పార్టీ పొత్తు.. మొన్నటి వరకు విజయ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు తాజాగా అమిత్ షా తమిళనాడులో పర్యటించాక విజయ్ బిజెపి పొత్తు అంశం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా తమిళనాడు పర్యటనకు వచ్చిందే విజయ్ ని తమ వైపు తిప్పుకొని విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా యూత్ ని ఎక్కువగా ఆకర్షించాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.ఈ ప్లాన్లో భాగంగా విజయ్ ఎట్టి పరిస్థితుల్లో బిజెపితో పొత్తు పెట్టుకోకుండా తప్పించుకోలేరని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. 


తమిళనాడు రాష్ట్రంలో చాలా దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయం ఉంది.అయితే ఈ ద్రవిడ రాజకీయాలకు చెక్ పెట్టాలంటే విజయ్ ని ఎరగా వాడుకోవాలని బిజెపి చూస్తుంది.విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకొని బిజెపి తమిళనాడులో పాగా వేయాలని చూస్తోంది.అయితే ఈ పొత్తు కేవలం సీట్ల వరకేనా లేక అధికారాన్ని పంచుకునే వరకు కూడా కొనసాగుతుందా అనేది తెలియదు. కానీ బిజెపి మాత్రం విజయ్ తో పొత్తు పెట్టుకొని విజయ్ కి అధికారం బాధ్యతను అప్పగించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారట.అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక అటు బిజెపి ఇటు డిఎంకె రెండు పార్టీలను విమర్శిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం బిజెపి పార్టీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.


అయితే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుండే ద్రవిడ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. అయితే బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుంటే విజయ్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినప్పటికీ సెక్యులర్ ఓట్లు మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రచారం ఏంటంటే.. త్వరలోనే బీజేపీ పెద్దలతో విజయ్ పొత్తు గురించి చర్చలు జరుపుతారని తెలుస్తోంది.మరి విజయ్ నిజంగానే బిజెపితో పొత్తు పెట్టుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: