
ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?
ఆసియా నాటో గనక ఏర్పడితే అందులో భారత్ చేరుతుందా.. ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. చేరే విధంగా రష్యా ఏమైనా ఒత్తిడి తెస్తుందా.. ఇప్పటికే చైనాతో భారత్ కు సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఆసియాలో భారత్ మాత్రమే చైనాకు పోటీ ఇవ్వగలదు. ఆర్థికంగా, రాజకీయంగా, యుద్ధపరంగా కాస్తో కూస్తో భారత్ మాత్రమే ఎదురు నిలబడ సత్తా ఉంది. కాబట్టి రష్యా, చైనాతో స్నేహ హస్తం అందిస్తే భారత్ ఏ విధంగా స్పందిస్తుందో ఎవరికి అంతుబడ్డని విషయం లా మారింది.
అమెరికా మాత్రం రష్యాకు సపోర్టు చేయకుండా భారత్ కు అండగా నిలబడేందుకు తోడ్పాటు అందిస్తుందనేది నిజం. అమెరికా, రష్యా, చైనాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు ప్రపంచ దేశాలకు విస్తరించేలా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలా అన్ని దేశాలు వేరు వేరు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పడు చాలా దేశాలు అణ్వస్త్ర దేశాలుగా మారిపోయాయి. వాటిని టచ్ చేయడానికి కూడా భయం వేసే పరిస్థితి ఉంది. అందుకే నార్త్ కొరియా లాంటి దేశం ఎంత రెచ్చగొట్టినా అమెరికా ఏం చేయలేకపోవడానికి కారణం అణ్వస్త్ర సామర్థ్యమే అని చెప్పొచ్చు.