
ఆ జనసేన ఎమ్మెల్యే.. పూర్తిగా ఇరుక్కుపోయాడా?
మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రాపాక వరప్రసాద్ కు రూ. 10 కోట్లు ఇవ్వాలని చూపినట్లు ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో వైరల్ గా మారింది. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి నేను వద్దన్నాను. నిజాయతీగానే ఉంటాను అనే వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు నిజం అన్నది ఆయన మనసుకు తెలియాలి. తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కూడా ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఆయన ఓటేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. కానీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడిన విషయం చర్చనీయాంశంగా మారింది.
నేను దొంగ ఓట్లతో గెలిచాను అని ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. కాపుల, ఎస్సీల ఓట్లు ఎవరికి పడతాయో తెలీదు. అంతకుముందు గెలిచినా, మొన్న గెలిచినపుడు కూడా దొంగ ఓట్లతో గెలిచాను. ఒక్కొక్కరు 15 ఓట్లు వేయడంతో 800 ఓట్ల తేడాతో గెలిచానని అన్నారు. ఇలా అనడం వరకే బాగానే ఉన్నా.. రాపాక గెలిచిన స్థానంలో టీడీపీ అభ్యర్థి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
అదే గనక జరిగితే ఆయన మాట్లాడిన వీడియోనే సాక్ష్యంగా నిలుస్తుంది. తనే స్వయంగా అన్న మాటలను ఎన్నికల కమిషన్ ముందుంచుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా నిజాయతీగా ఉన్నా అని రాపాక, దొంగఓట్లతో గెలిచానని చెప్పి ఒక్కసారిగా ఇరుక్కుపోయాడు.