విజయ మాల్యా స్కామ్‌.. బ్యాంకులకూ పాత్ర?

విజయ్ మాల్యా అంటే విలాసవంతమైన జీవితం అని అందరూ చెప్పుకునే వారు. మాల్యాకు డబ్బులు ఇవ్వమని గతంలో చెప్పిన వారు యూపీఐ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలనే అనుమానాలు అందరిలో కలిగాయి. 2016-17 నాటికి మాల్యా సంస్థలు నష్టాల్లో ఉన్నట్లు తెలిసి బ్యాంకు లోన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలను కాపాడుకునేందుకు బ్యాంకుల నుంచి అప్పటి కేంద్ర ప్రభుత్వం లోన్లను ఇప్పించినట్లు తెలుస్తోంది.

అప్పులను తీర్చేందుకే లోన్లను ఇచ్చినట్లు అది కూడా కేంద్ర క్యాబినెట్ చెప్పిన విధంగా నే బ్యాంకులు లోన్లు అందించాయనే వివరాలు బయట వినిపిస్తున్నాయి. సీబీఐ ఛార్జీషీటులో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. విజయమాల్యా దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ వాటిని చెల్లించకుండా తర్వాత వచ్చిన బ్యాంకు లోన్లతో లండన్ లో ఆస్తులు కొన్నట్లు పేర్కొంది. విజయ్ మాల్యా దగ్గర డబ్బులు ఉన్నా బ్యాంకులు వాటిని రికవరీ చేయలేదని చెప్పుకొచ్చింది.

మాల్యా నష్టపోతున్న సమయంలో ఇచ్చిన లోన్లతోనే విలాసవంతమైన భవంతులు, ఆస్తులు లండన్, ప్రాన్స్ లలో కొన్నట్లు సీబీఐ తన చార్జీషీట్ లో తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు చాలా మందిని అరెస్టు చేసిన సీబీఐ, మాల్యాను ఇండియా తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే చేస్తోంది.

మొత్తం మీద పకడ్బందీగా ప్లాన్ చేసుకుని డబ్బులను పట్టుకుని మాల్యా లండన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరి ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీస్తుందని ప్రచారంతో సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో బ్యాంకు లోన్లు ఇప్పించారని తెలుస్తోంది. కానీ తీర్చే స్తోమత ఉండి అబద్ధాలతో మరింత లోన్లు తీసుకుని విదేశాలకు మాల్యా వెళ్లిపోయాడు. ఈ కుంభకోణంలో ఇప్పటికే చాలా మంది అరెస్టు అయ్యారు. ఇక విజయ మాల్యాను భారత్ కు తీసుకురావడంలో సీబీఐ, ఈడీ సఫలమవుతాయా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: