వాళ్లతో జగన్‌కు తలనొప్పి తప్పదా?

కోర్టులో కేసులు వచ్చినప్పుడు, ఆ కేసును ఎదుర్కోవడానికి సరైన పాయింట్లు లేదా డైవర్షన్ పాయింట్ల విషయంలో తెలుగుదేశానికి ఉన్నంత సుదీర్ఘ అనుభవం వైఎస్సార్సీపీకి లేదని కొంతమంది వాదన. తెలుగుదేశానికి వచ్చేసరికి పరకాల ప్రభాకర్ గాని, కుటుంబరావు గాని ఇలా దాదాపు 800 మంది దాకా సలహాదారులు ఉన్నారు. వైఎస్ఆర్సిపి కూడా సలహాదారులను పెట్టుకుంది. ఆ రోజున వైసీపీ ఏమీ చాలెంజ్ చేయలేదు. వేరే వాళ్ళు కూడా ఏమీ సవాల్ చేయలేదు.

సవాల్ చేసినా ఏం చెప్తుంది ప్రభుత్వం సవాల్ చేసిన వాళ్ళ అర్హతేంటి, ఆ వెనకాల ఉన్నవాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి, ఆ వెనకాల ఉన్న వాళ్ళ రాజకీయాలు ఏంటి అని అటువైపు డైవర్ట్ చేసుకొని పోతుంది. ఇక వైయస్సార్సీపీ పార్టీ విషయానికి వచ్చేసరికి అదే సలహాదారుల విషయంలో దానికి తేడా కొట్టింది. దానికి కారణం వీళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, సరైన గైడెన్స్ కూడా లేకపోవడం కారణాలు అని తెలుస్తున్నాయి. అధికారుల మీద డిపెండ్ అయిపోతారట.

ఇదిగో మా సలహాదారుకి అపాయింట్మెంట్ ఇచ్చేయండి ,ఆ తర్వాత ఇంత జీతం ఇచ్చేయండి అని చెప్పేస్తారు. ఆ తర్వాత కోర్టులో సవాల్ చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మంత్రులకే సలహాదారులను పెడతారంట. ఇప్పుడున్న మంత్రులు అందరికీ ఒక్కొక్క సలహాదారులను ఇస్తారని తెలుస్తుంది. అది కూడా వాళ్ళు అడిగితే ఇస్తారట. తద్వారా వీళ్ళందర్నీ ఆ రూట్లో అపాయింట్మెంట్ చేస్తారట.

ఆ రూట్లోకి మారుస్తాం అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు చేసింది తప్పనేగా. వాళ్లను కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోకి తీసుకువస్తామని, వాళ్లందర్నీ ఏసీబీ పరిధిలోకి తీసుకొస్తామని అంటున్నారట. ఈ రెండేళ్లు, ఐదేళ్ల తర్వాత వాళ్ళకి పర్మనెంట్ జీతాలు ఇస్తారా, ఎసిబీ పరిధిలోకి రావాలంటే వాళ్ళు పర్మినెంట్ అయి ఉండాలి కదా. మరి పర్మినెంట్ అవ్వకుండానే వస్తే అదొక వింత అయ్యే సందర్భం అవుతుంది. న్యాయపరమైన వ్యవహారంలో ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: