లాజిక్: కవిత విచారణ ఎగ్గొట్టింది అందుకేనా?
మొదటి సారి వెళ్లిన కవితను ఈడీ 9 గంటల పాటు విచారించింది. తర్వాత 16 న వెళ్లాల్సి ఉండగా విచారణకు వెళ్లకుండా సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. దీనిపై ఈడీ కూడా సుప్రీం కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా స్టే ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని అడిగింది. కవిత ఆకస్మాత్తుగా విచారణకు రాకపోవడం కారణం.. ఆ రోజు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మరో విషయం రామచంద్ర పిళ్లై చెప్పిన అన్ని వివరాలు కవితే చేయించిందని స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఇరాకాటంలో పడింది.
దీంతో న్యాయనిపుణులను సంప్రదించిన ఆమె విచారణకు హాజరు కాలేనని ఆరోగ్యం బాగో లేదని చెప్పింది. మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా.. కావాలనే ఈడీ టార్గెట్ చేస్తుందని తన ఫోన్ ను లాక్కుందని ఆరోపించింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఈడీపై ఆరోపణలు చేసింది. సుప్రీం కోర్టు 24 న కేసు విచారణ జరుపుతామని చెప్పింది. ఈడీ 20నే రావాలని కవితకు మరోసారి నోటీసులు పంపించింది. మరి ఇవాళ విచారణ ఎలా సాగుతుందో ఏమో..?