మహారాష్ట్ర విచిత్ర రాజకీయం: బీజేపీతో పవార్‌?

జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య ఎప్పుడు సమన్వయం ఉంటుందో తెలీదు. కొట్లాటలకు ఎప్పుడు దిగుతారో తెలియదు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి పడదు. బీజేపీ, కాంగ్రెస్ కు పడదు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీని మహారాష్ట్రలో అధికారానికి దూరం చేశాయి. ఎన్సీపీ ఎన్నడూ కూడా బీజేపీకి సపోర్టు ఇచ్చినట్లు కనిపించ లేదు. కానీ నాగాలాండ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్సీపీ రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందితే అక్కడ బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటించింది. వీరి అవసరం లేకుండానే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ గెలిచిన ఇద్దరు కూడా బీజేపీకే సపోర్టు చేస్తున్నారు.



ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకులుగా పని చేస్తారు. నాగాలాండ్ లో అదే బీజేపీకి ఎన్సీపీ మద్దతు తెలుపుతుంది. అంటే రాజకీయాలను ఎవరూ అంచనా వేయాలేనంత క్షణక్షణం మారుతూ ఉంటాయనడానికి ఇదొక నిదర్శనం. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనతో స్నేహం చేస్తున్న ఎన్సీపీ, బీజేపీని శత్రువుగా పరిగణిస్తుంది. బీజేపీకి ఏకంగా రెండు సంవత్సరాలపైనే అధికారాన్ని దూరం చేయడంలో శరద్ పవార్ విజయం సాధించారు.



మోదీ, అమిత్ షా ముందు పవార్ ఎత్తుగడ ఎప్పటికీ ఉంటుందనుకోవడం పొరపాటే. శివసేనలోని ఎమ్మెల్యేలనే బీజేపీ ఆకర్షించి మహా ఆఘాడీ సర్కారును గద్దె దించింది. షిండేను ముఖ్యమంత్రి చేసి బీజేపీ తన సత్తా చాటుకుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని శివసేన ఊహించలేదు. సీఎం పదవి కోసం ఉద్దవ్ ఠాక్రే ఎప్పటి నుంచో మిత్రులైన బీజేపీని దూరం పెట్టి ఎన్సీపీ, కాంగ్రెస్ లకు దగ్గరయ్యారు. ఇప్పడు ఎన్సీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఇన్నాళ్లు పవార్ ను నమ్మిన ఠాక్రేకు ఇది షాక్ లాంటిదే. రేపు మహారాష్ట్రలోనూ బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇస్తే శివసేన పరిస్థితి ఏమవుతుంది. అందుకే రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్యహత్యలే ఉంటాయనడానికి శివసేననే నిదర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: