ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?

చైనాపై జర్మనీ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతుంది. జర్మనీ ఛాన్స్ లర్ ఓలాబ్ షోల్ చైనాను హెచ్చరించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తుందంటూ తేలిన నిజాలతో అమెరికా చైనాపై ఆంక్షలకు సిద్ధమవుతున్న వేళ జర్మనీ కూడా అదే బాట పట్టనుంది. జర్మనీలో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంతో ఆయిల్ దొరక్క తీవ్ర ఆర్థిక సమస్యలు వస్తున్నాయి.

అమెరికా, గల్ప్ దేశాలు ఆయిల్ ఇస్తున్నప్పటికీ ఎక్కువ ధరకు కొనుక్కొవడంతో తీవ్రంగా నష్టపోతుంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఆర్థిక అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో యుద్ధం నుంచి బయటకు వచ్చి రష్యాకు సపోర్టు ఇద్దామని అనుకున్న ప్రస్తుతం తీసుకునే ఉద్దేశంలో రష్యా లేదు. అమెరికా ఏదీ చేస్తే అది చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాటో నుంచి వైదొలగాలని జర్మనీ ప్రజలు చేస్తున్న ఆందోళనలు తీవ్ర తరం అవుతున్నాయి.  నాటో నుంచి వైదొలిగితే అన్ని యూరప్ దేశాల్లో జర్మనీ ప్రజలకు దొరికే ఉద్యోగాలు పోతాయి.

ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. వ్యాపారాలు కుదేలవుతాయని జర్మనీ ఆలోచిస్తుంది. మింగలేక కక్కలేక అన్నట్లు ఉంది జర్మన్ ప్రభుత్వ పరిస్థితి. ఈ సమయంలో అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తూ చైనా రష్యాకు ఎందుకు ఆయుధాలు సరఫరా చేస్తుందని ప్రశ్నించింది.  చైనా మాత్రం మేం ఆయుధాలు సరఫరా చేయడం లేదు. కేవలం రా మెటీరియల్స్ మాత్రమే చేస్తున్నామని చెప్పుకొచ్చింది. దీని వల్ల వారు ఆయుధాలు తయారు చేసుకుంటున్నారని మేం పంపడం లేదని చెప్పింది. అయినా కూడా జర్మనీ చైనా పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

చైనా, జర్మనీ మధ్య ఆంక్షలు వస్తే ఎలాంటి వ్యాపారాలు దెబ్బతింటాయి. ఇది ఎంత దూరం వెళుతుందనేది చూడాలి. ప్రస్తుతం అమెరికా చైనాపై ఆంక్షలకు సిద్ధమవుతున్న వేళ చైనా కూడా ఘాటుగానే స్పందించింది. మీరు ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వొచ్చు.. మేం ఇవ్వకూడదా అని అమెరికాను ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: