మహాసేన రాజేశ్: ఈ యూట్యూబర్‌ టీడీపీ ఎమ్మెల్యే?

బడుగు బలహీన వర్గాలకు చెందిన మహాసేన రాజేశ్ ఈ నెల 16న తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నట్లు  ఓ ప్రముఖ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అనంతరం మిగతా పత్రికలు కూడా ఈ  విషయాన్ని బయటకు తెలిపాయి. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈయన యూట్యూబ్ చానల్, ఇతర విషయాల ద్వారా వెలుగులోకి వచ్చారు. ఈయన గతంలో జనసేన లో చేరారు. దాని నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం తెలుగుదేశంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

రాజేశ్ టీడీపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో సఫలమయ్యాడు. టీడీపీకి కూడా ఈయన వర్గం నుంచి బలమైన నాయకుడు లేరు. ఇతడిని ఉపయోగించుకుంటే బాగుంటుందనే ఆలోచనలోనే ఉంది. తెలుగుదేశం, జనసేనను ఇబ్బంది పెట్టి సంతోషపడే వారిని రాజేశ్ పదునైన విమర్శలతో ఆడుకునేవారు.  తద్వారా ఆ పార్టీకి దగ్గరయ్యారు. ఇదే సమయంలో వైసీపీలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు ఎక్కువగానే ఉన్నారు.

రాజేశ్ గతంలో వైసీపీలో కూడా చేరారు. కానీ అక్కడ గుర్తింపు లేదు. దీంతో బయటకొచ్చేశారు. ఇతను తన యూట్యూబ్ ఛానల్ లో కొంచెం వల్గర్ గా కూడా మాట్లాడేవారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ వేయాలనుకుంటున్నా సమయంలో తన భాషను సరిదిద్దుకుంటున్నాడు. కాస్త హుందాగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొత్తం మీద రాజేశ్ కు ఎమ్మెల్యే టికెట్ కన్పర్మ్ అయినందుకే టీడీపీలో చేరుతున్నట్లు ఊహగానాలు వెలువడుతున్నాయి. మరి రాజేశ్ టీడీపీలో చేరడం వల్ల ఆ పార్టీకి లాభం చేకూరుతుందా.. ఈయన వర్గానికి చెందిన వారి ఓట్లు టీడీపీకి గంపగుత్తగా పడేలా చేస్తారా? టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. జనసేన నుంచి బయటకొచ్చిన రాజేశ్ ఎలా ఆ పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోగలరు. ఏదేమైనా రాజేశ్ టీడీపీలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పార్టీకి ఒక నాయకుడు దొరికినట్లు అవుతుంది. విజయం సాధిస్తాడా.. లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: