ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా సంచలన నిర్ణయం?

రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. గతంలో ఉన్నంతా భీకర దాడులు లేవు. పదే పదే చేస్తున్న దాడుల వల్ల ఇరు దేశాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ మాత్రం యూరప్ దేశాలను ఆయుధాలు, యుద్ధ విమానాలు, బాంబులు ఇవ్వాలని వేడుకుంటోంది. రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ భయపడుతోంది. కీలకమైన పరిణామం ఏమిటంటే మంచు ప్రభావం తగ్గిపోతుంది.

దీంతో రష్యా దాడులను పెంచే అవకాశం ఉంది. మొత్తం ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని చూస్తుందనేది ఉక్రెయిన్ వాదన. ఫిబ్రవరి 24కు ఈ యుద్ధం ప్రారంభమై ఏడాది అయింది. మొదట్లో ఈ యుద్ధం వారంలో ముగుస్తుంది. నెలలో అయిపోతుంది అని ఎంతో మంది విశ్లేషణ చేశారు. కానీ దాదాపు ఏడాది కావొస్తుంది. ఇప్పటి వరకు యుద్ధం ముగియలేదు. రెండు దేశాల పోరాటం ఆగడం లేదు. ప్రస్తుతం ఉక్రెయిన్ మాత్రం ఒక ఆరోపణ చేస్తుంది. యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావొస్తుంది.

కాబట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు 5 లక్షల మంది సైన్యంతో మరింత భీకరంగా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఉక్రెయిన్ అనుమానిస్తోంది. ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్టర్ కు అందిన సమాచారం ప్రకారం.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడాది కావొస్తుంది. రష్యా అధ్యక్షుడు 5 లక్షల మందితో భీకరంగా దాడి చేయాలని భావిస్తున్నారని దీనిపై పుతిన్ అల్రడీ సమాలోచనలు జరిపినట్లు ఆయన ఆరోపించారు.

అయితే యుద్ధం అనేది ఎక్కువ కాలం జరగడం వల్ల రెండు దేశాలు ఆర్థిక పరంగా చాలా నష్టపోతున్నాయి. పట్టు వదలని విక్రమార్కుడిలా పుతిన్, ఏ మాత్రం తగ్గేది లేదంటూన్న జెలన్ స్కీల పోరాటంతో దాదాపు యుద్ధం ఏడాది కావొస్తుంది. ఇందులో సామాన్య పౌరుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోంది. యుద్ధానికి ఎప్పుడు ముగింపు వస్తుందో.. మళ్లీ సాధారణ జీవితం ఎప్పుడు గడుపుతామోనని ఉక్రెయిన్ పౌరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: