వైసీపీలో వాళ్లకే పదవులు వస్తాయా.. నిజం ఏంటి?

నెల్లూరు జిల్లాలో కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఆనం, కాకాని నల్లపురెడ్డి, మేకపాటి, లాంటి వారి వంశస్థులు ఎక్కువగా రాజకీయాల్లో ఉంటారు. వారే పోటీ చేస్తారు. అలాంటి వారి మధ్య ప్రస్తుతం ఎమ్మెల్యే గా గెలిచి మంత్రిగా చేసిన వ్యక్తి అనిల్ యాదవ్. అదే జిల్లాకు సంబంధించి కోటంరెడ్డిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గెలిచారు. అయితే కోటంరెడ్డి ఒక పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు గెలుస్తున్నాయి. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. రాజకీయాల్లో ఎదుగుదల కూడా ఉండదు. అయినా 35 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇంకా చేస్తాను. గోడలపై రాతలు రాశాను. లాఠీ దెబ్బలు తిన్నాను ప్రజలకు కింది స్థాయి వరకు వెళ్లి సేవ చేశాను. అయినా ఇప్పటివరకు మంత్రిని కాలేకపోయానని ఆవేదన వెలిబుచ్చారు.

నెల్లూరు జిల్లాలో వారసత్వ రాజకీయాలతో పాటు వారి పిల్లలు వారి మనమలు కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలని కోరుకుంటూ వారే గెలవాలని ఆశిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.  కానీ ఇదే సమయంలో కోటంరెడ్డి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే కుటుంబ నాయకులు ఉన్నప్పటికీ అనిల్ యాదవ్ లాంటి వ్యక్తి కూడా మంత్రి అయ్యారు.  ప్రజలను నమ్ముకుని గెలిచారు. దానికి సంబంధించి వారి నాయకుడు జగన్ ఆయనను మంత్రి కూడా చేశారు.. ఇదే విధంగా శ్రీధర్ రెడ్డి కూడా మరి కాస్త ఓపిక బట్టి ప్రజల్లో తిరుగుతూ ప్రజల మనిషిగా నిలిస్తే పదవులు వాటి అంతటావే వస్తాయి.

కానీ ఇలా పది మందిలో పదవి రాలేదని వేరే వాళ్ళు రాజకీయాలన్నీ శాసిస్తున్నారు అనడం వల్ల ఏమాత్రం లాభం లేదు. ఒక వ్యక్తికి గుర్తింపు అనేది ప్రజల నుంచి వస్తే దానికి సంబంధించి లాభం కచ్చితంగా జరుగుతుంది. మరి కోటంరెడ్డి భవిష్యత్తులో మంత్రి అవుతాడా ఇలాగే ఎమ్మెల్యే గానే ఉండి పోతాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP

సంబంధిత వార్తలు: