జగన్‌ లోకేశ్‌ను పనిగట్టుకుని హీరోను చేస్తున్నారా?

నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడానికి వైసిపి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు ఎందుకు వేస్తుంది.? లోకేష్ ని చూసి వైసిపి ప్రభుత్వం భయపడుతోందా? నారా లోకేష్ పాదయాత్ర చేస్తానంటే రాష్ట్ర డిజిపి జిల్లాలలో అనుమతి తీసుకోవాలని చెప్పడం ఎంతవరకు సబబు? గతంలో వైయస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక అనుమతి తీసుకుని ఆ తర్వాత రూట్ మ్యాప్ విధంగా ఆయా జిల్లాలలో అనుమతి తీసుకున్నారు.? 28వ తేదీ నుంచి కుప్పంలో పాదయాత్ర ప్రారంభించాలనుకుంటున్న నారా లోకేష్ కు ఇప్పటివరకు కూడా అనుమతి రాలేదు.

హైకోర్టులో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నారా..? పాదయాత్రలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తోందా? మరి అలా టిడిపి ప్రభుత్వం అనుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? నారా లోకేష్ పాదయాత్ర అనగానే వైసిపి నేతలు వెటకారంగా మాట్లాడడం ప్రారంభించేశారు.  గతంలో ఎప్పుడో ఒకసారి చిన్న తప్పు మాట్లాడినటువంటి లోకేష్ ను  పట్టుకొని అదే పనిగా వెటకారంగా మాట్లాడడం రాజకీయాలు చేయడం విషయం కాదు. గతంలో లోకేష్ బయటదేశాల్లో తిరిగినటువంటి ఫోటోలను పెట్టుకుని వాటిని ప్రచారం చేస్తూ ఈయన పాదయాత్ర చేయడం ఏమిటని అని వైసిపి నాయకులు కొన్ని వెటకార చర్యలు చేస్తున్నారు.

పాదయాత్ర చేస్తామంటే దరఖాస్తు ఇవ్వని పరిస్థితి నెలకొంది. అయినా లోకేష్ పాదయాత్ర చేస్తానంటే వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లోకేష్ ని వైసిపి ప్రభుత్వం హీరో చేయాలని అనుకుంటోందా? లేక వైసిపి ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేస్తోందా? చంద్రబాబుని తక్కువ చేసి చూపించి లోకేష్ ని ఎక్కువగా చూపించడం వల్ల ఏదైనా లబ్ధి పొందాలని వైసిపి ప్రభుత్వం భావిస్తుందా?ఏదైతేనేం రాష్ట్రంలో గతంలో పాదయాత్రలు జరిగాయి. ప్రస్తుతం పాదయాత్రలు చేయాలని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. వారికి అనుమతి ఇవ్వడంలో తాత్సారం వైసిపి ప్రభుత్వానికి చేటు తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: