70 లేఖలు రాసినా పట్టించుకోరా? తెలంగాణ అసంతృప్తి

కృష్ణా నదీయాజమాన్య బోర్డుపై తెలంగాణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా జల వివాదాల తొలి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలుచేయాలని తాము రాసిన 70 లేఖలపై నదీ యాజమాన్య బోర్డు నుంచి ఏ స్పందనా లేదని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు ఛైర్మన్ కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ మరో లేఖ రాశారు.

ఇంతకీ ఈ లేఖలో ఏమున్నాయంటే.. ముఖ్యమైన 7 అంశాలు, 70 లేఖలకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచారు. తాగు నీటి కోసం తీసుకున్న జలాలను 20 శాతం మాత్రమే లెక్కించాలని ట్రైబ్యునల్  చెబుతున్నా అమలు చేయలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు. ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసినా స్పందన లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ రాశారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2015, 2017లో అడ్ హక్ ప్రాతిపదికన కేటాయింపులు చేశారన్న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్.. తెలంగాణకు 70శాతం నీటిని కేటాయించాల్సి ఉందన్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ఖరారుకు వివరాలు ఇవ్వాలని కేంద్రం, బోర్డును కోరినా ఇవ్వలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు. ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులు సాగకుండా ఏపీ పదేపదే ఆటంకాలు సృష్టిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు.

ఆర్డీఎస్‌ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ కోరారు. ఆర్డీఎస్‌ కుడికాల్వపై అనుమతుల్లేకుండా ఏపీ  చేపట్టిన పనులు ఆపాలని  అంతవరకు డీపీఆర్‌ను పక్కకు పెట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. పలు అంశాలు పరిష్కారం కాలేదన్న  తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్... వాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: