బీజేపీనీ టీడీపీనీ కలవనివ్వని 'శకుని' ఆయనేనా?

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే అంశంపై చర్చలు జోరందుకున్నాయి. అధికార వైసీపీ మాత్రం తాము మరోసారి సింగిల్‌గానే బరిలో దిగుతామని ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే.. విపక్షాల్లోనే ఇంకా పొత్తులపై క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. ఆ రెండు పార్టీల మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు.

మరోవైపు టీడీపీ మాత్రం కచ్చితంగా జనసేనతో పొత్తుతో వెళ్లకపోతే మరోసారి భంగపాటు తప్పదని భావిస్తోంది. ఎలాగైనా పవన్‌తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. మరి పవన్‌ అటు బీజేపీతోనూ ఇటు టీడీపీతోనూ పొత్తులో ఉంటారా లేక.. బీజేపీ చేయి విడిచిపెట్టి టీడీపీతో జట్టు కడతారా అన్న దానిపై క్లార్టీ లేదు. ఇలాంటి  సమయంలో ఓ బీజేపీ ఎంపీ టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య శకునిలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు శకుని పాత్ర పోషిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.

బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు  బీజేపీ గురించి మాట్లాడకుండా చంద్రబాబు పై విషం చిమ్ముతున్నారని జవహర్ మండిపడ్డారు. పొత్తు పొసగుతుందని జగన్ కన్నా బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు  ఎక్కువ ఆందోళనలో వున్నారని జవహర్ ఎద్దేవా చేశారు. దక్షిణాది లో వారి బలం తెలిసి కూడా బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు ఇలా మాట్లాడటం సరికాదని జవహర్ అన్నారు. జగన్ కు ఏజంట్ గా జివియల్ వున్నారని జవహర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వున్న పరిస్థితి బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు కు ఆనందంగా వున్నట్లు వుందని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ సాగనంపటం మీద బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు కు దృష్టి లేదని టీడీపీ నేతలు అంటున్నారు. తెలుగుదేశం పై బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు  ద్వేషం వీడాలని హితవు పలికారు. విభజిత ఆంద్రప్రదేశ్ కు రావలసిన ప్రయోజనాల గురించి బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు మాట్లాడాలని జవహర్ కోరారు. విశాఖ దోపిడి జివియల్ కు కనపడక పోవటం వింతేమీ కాదన్న జవహర్ బీజేపీ ఎంపీ జీవీయల్ నరసింహారావు  చంద్రబాబు ను విమర్శించటం మానుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: