ఎన్నికలపై సీఎం జగన్ సంచలన ప్రకటన..?
వారానికి కనీసం రెండు నియోజకవర్గాల్లో కేడర్‌ని పిలిచి వారితో మాట్లాడుతున్నానని.. ప్రతి ఒక్కరితో కనీసం ఒకట్రెండు నిమిషాలు మాట్లాడుతున్నానని... వాళ్ల భావాలను కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి కదా అని చాలమంది అనుకోవచ్చని.. మరో 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. దానికి సన్నద్ధం కావాల్సి ఉందని సీఎం జగన్ హెచ్చరించారు.
ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ఇంత పారదర్శకంగా, వివక్షకు, అవినీతికి తావులేకుండా సాగుతోందని.. పథకాలు గతంలో ఏ రోజూ కూడా సామాన్యుడి దగ్గరకి పోలేదని సీఎం జగన్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగుతుందన్న సీఎం జగన్ .. వివక్షకు ఏమాత్రం తావులేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోందని మెచ్చుకున్నారు. సచివాలయాలనే గొప్ప వ్యవస్ధను తీసుకునిరాగలిగామని.. వాటితో పాటు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతం పై చిలుకు హామీలను నెరవేర్చామని సీఎం జగన్ అన్నారు.
అందుకే ప్రజలకు దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీస్సులు కోరుతున్నామని.. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 కు 175 నియోజకవర్గాలు గెలవాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేయాల్సి ఉందని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపు ఇచ్చారు.