జగన్‌.. రిజర్వేషన్‌ ఇస్తావా.. ఆగ్రహం చూస్తావా?

జగన్ సర్కారుపై కాపు కులాలు మండిపడుతున్నాయి. తమకు EWS రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా EWS రిజర్వేషన్ 10శాతంపై ఇచ్చిన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాపు ఒంటిరి తెలగ, బలిజ కులాలకు గత ప్రభుత్వం ఇచ్చిన 5శాతం రిజర్వేషన్‌ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కాపు ఐకాస కన్వీనర్ ఆకుల రామకృష్ణ డిమాండ్ చేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కాపు నాయకులతో కలిసి రామకృష్ణ సమావేశాన్ని నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పు చారిత్రికమన్నారు. ఈ తీర్పును రాష్ట్రంలో అమలు చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 10శాతం రిజర్వేషన్లో 5శాతం కాపులకు ఇస్తూ జీవో జారీ చేయడంతో పాటు అమలుకు ఉత్తర్వులు కూడా ఇచ్చారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు గడిచినా 5శాతం రిజర్వేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. కోర్టులో ఈ విషయం పెండింగ్‌లో ఉందని ఉందని ఇప్పటి వరకూ ఈ ప్రభుత్వ నాయకులు చెబుతూ వచ్చారని.. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 5శాతం రిజర్వేషన్ కాపులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మార్పులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయమని కేంద్రం చెప్పిందన్నారు.

ఇటీవల కాలంలో రాజమహేంద్రవరంలో కాపు ఒంటరి తెలగ బలిజ ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం మయ్యారని ఎంతో సంతోషకరమని.. ఈ ప్రజాప్రతినిధులు కాపులకు రావాల్సిన రాయితీ పథకాలు, రిజర్వేషన్పై సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుటుందన్నారు. ఏదో గొప్పగా కేసులు ఉపసంహరించుకున్నామని చెబుతున్నారని.. ఉద్యమంలో పెట్టిన కేసులు కనుక ఏ ప్రభుత్వమైన తీసివేయడం సహజమన్నారు. కాపులకు రాయితీ పథకాలు, రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఈ ఫలితం ప్రభుత్వం అనుభవించాల్సి వస్తుందని.. ఆ వర్గాల ప్రజల ఆగ్రహానికి గురివాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: