షాకింగ్‌: ఉత్తరాంధ్రవాసులు.. రాజధాని కోరుకోవట్లేదా?

ఏపీలో మరోసారి రాజధాని వివాదం నడుస్తోంది. విశాఖే రాజధాని కావాలంటూ ఉత్తరాంధ్ర నేతలు
స్వరం పెంచుతున్నారు. ప్రత్యేకించి వైసీపీ నేతలు ఈ వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కావాలనే కోరిక లేదట. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  జి.వి.హర్షకుమార్ చెబుతున్నారు. తనకు ఉత్తరాంధ్ర ప్రజల నాడి తెలుసని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  జి.వి.హర్షకుమార్ స్పష్టంచేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే విశాఖ ప్రజలు స్పందించారు కానీ  రాజధాని కోసం ఎవరూ స్పందించ లేదని  జి.వి.హర్ష కుమార్ అన్నారు.

తాజా ఉద్యమం వైకాపా నేతలు  చేయిస్తున్న బలవంతపు ఉద్యమని జి.వి.హర్ష కుమార్ అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలే కాదు వైసీపీ వాళ్లు విశాఖకి రాజధాని రావాలని కోరుకోవడం లేదని జి.వి.హర్ష కుమార్ వ్యాఖ్యానించారు.  విశాఖకు రాజధాని కావాలంటూ మూడేళ్లుగా రాజీనామాలు చేయని వైసీపీ నేతలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని జి.వి.హర్ష కుమార్ నిలదీశారు.  వైసీపీ   ఎమ్మెల్యేలు వాళ్లంతట వాళ్లు రాజీనామా చేయడం లేదన్న జి.వి.హర్ష కుమార్..  సీఎం జగనే వాళ్లతో రాజీనామా చేయిస్తున్నారని ఆరోపించారు.

విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా గురించి మాట్లాడని వాళ్లు మూడు రాజధానుల గురించి రాజీనామా చేస్తున్నారంటే ఎవ్వరూ నమ్మరని జి.వి.హర్ష కుమార్ మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ ఒక్క రాజధానికే కట్టుబడి ఉందని, నాన్ పొలిటికల్ జేఏసీతో తాము కలవబోమని జి.వి.హర్ష కుమార్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గొప్ప సంస్కరణ వాదిలా మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్న జి.వి.హర్ష కుమార్.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ ఎలా పెట్టారని ప్రశ్నించారు.  కేసీఆర్ లాంటి సంకుచిత భావాలున్న నేత రాణించిన దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడా లేదని జి.వి.హర్ష కుమార్ విమర్శించారు. అయితే.. ఏ ఉద్యమమైనా నిలకడ మీద తెలుస్తుంది. మరి ఈ కొత్త ఉద్యమం నిలకడ ఏంటో చూద్దాం..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: