జగన్‌లో పెరిగిపోతున్న అసహనం.. అందుకేనా?

ఏపీ సీఎం జగన్ టెన్షన్ పడుతున్నారా.. తన ప్రభుత్వ పనితీరుపై తానే అసహనం వ్యక్తం చేస్తున్నారా.. తాను బ్రహ్మాండంగా నిధులు విడుదల చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆ ప్రభావం తగినంతగా కనిపించడం లేదని ఫీలవుతున్నారా.. నాలుగో ఏడాది పాలన నడుస్తున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని ముందుగానే ఫీలవుతున్నారా.. అంతర్గతంగా  చేయించుకున్న సర్వేల్లో ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయా.. ఇలా కారణాలు ఏమైనా కానీ.. ఇటీవల ఏపీ సీఎం జగన్‌లో అసహనం పెరిగిపోతోంది..

ఆ అసహనం నేరుగా కనిపిస్తోంది. మొన్న ఇప్పటి వరకూ లబ్ది పొందని వర్గాలకు నిధులు విడుదల చేస్తున్న సమయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఈ విషయం స్పష్టంగా కనిపిచింది. సమావేశానికి జగన్ వచ్చి కూర్చున్నా.. ఇంకా కొందరు కలెక్టర్లు రాకపోవడంపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్క్రీన్‌ పై ఇన్నిన్ని ఖాళీలు పెట్టుకుని ఎట్లా చేస్తా ఉండారు.. అంటూ విసుక్కున్నారు. ఇక తాజాగా.. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సదస్సులోనూ సీఎం జగన్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మొత్తం మీద ఎక్కడో తేడా కొడుతోంది.. ఏదో తేడా సంకేతం కనిపిస్తోంది. సీఎం జగన్‌లో అంతకు ముందు ఉన్నంత ధీమా మాత్రం కనిపించడం లేదనే చెప్పాలి. ఇందుకు కారణాలు లేకపోలేదు.. సీఎం జగన్ ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్‌ పెట్టారు. తాను ప్రకటించిన మేనిఫెస్టో అమలుపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అందుకోసం లక్షల కోట్లు నగదు బదిలీ చేశారు. అనేక పథకాలకు డబ్బు లోటు రాకుండా చూసుకున్నారు.

అయితే.. ఇంత చేస్తున్నా.. దాని ఫలితాలు క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బహుశా ఇదే ఇప్పుడు జగన్‌ను కలవరపెడుతుండవచ్చు. ఈ లోపాన్ని సరి చేసుకోవాలని ఆయన  తీవ్రంగా ప్రయత్నిస్తుండవచ్చు. అందులో భాగంగానే ఈ అసహనం కనిపిస్తుందేమో అనిపిస్తోంది. అదే నిజమైతే.. దాన్ని సరి చేసుకునేందుకు జగన్‌కు ఇప్పటికీ తగిన సమయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: