
పోలవరంపై వైసీపీ వర్సెస్ టీడీపీ.. నిజమెంత?
అయితే.. ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. ఈ అంశంపై జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. 1986 తర్వాత గోదావరికి ఇంత పెద్ద ఎత్తున వరద రాలేదని.. పునరావాస చర్యలు విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అంటున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒక్క ప్రాణం కూడా పోకుండా అధికారులు సహాయక కార్యక్రమాలు అందించారని మెచ్చుకున్నారు. నేతలు, అధికారులు వాలంటీర్ల సహాకారంతో సహాయక చర్యలు చేపట్టారన్న జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం వద్ద 27 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించడంతో మొదట భయపడ్డామన్నారు.
28లక్షల క్యూసెక్కుల వరద లక్ష్యంతో గతంలో కాపర్ డ్యాం ను నిర్మించారని.. కానీ 30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా డ్యాం దెబ్బకుండా ఉండేలా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు దెబ్బతినకుండా కాపర్ డ్యాం ఎత్తు మీటర్ పెంచామని.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
6 గురు కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను చేశారని.. గోదావరి వరదల్లో రాజకీయం చేస్తే ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు చెబుతున్నానని విమర్శించారు. ఎన్ని చేసినా చంద్రబాబు రాజకీయంగా బతకడన్న జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు.. 1995 నుంచి 2004 వరకు ఎన్నో ఏళ్లు పాలన చేసిన చంద్రబాబు పోలవరం గురించి ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు.