ఇదేం మీడియా.. మరీ ఆ స్కీమ్‌పై కూడా అడ్డగోలు రాతలా?

మీడియా అన్నాక ప్రజాపక్షం వహించాలి.. నిజమే.. కానీ.. మేం కొన్నిసార్లు మాత్రమే ప్రజాపక్షం ఉంటాం.. మాకు నచ్చిన వాళ్లు అధికారంలో ఉంటే మాత్రం అంతా సుభిక్షంగా ఉందంటాం.. నచ్చని వాళ్లు గద్దె ఎక్కితే మాత్రం దిగే వరకూ వ్యతిరేక వార్తలు వండివారుస్తాం అంటే ఎలా.. ప్రస్తుతం అలాగే ఉంది కొన్ని మీడియాల సంగతి.. జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. వాటిలో అనేక మంచీ చెడూ ఉన్నాయి.. మంచిని మంచిగా చెడును చెడుగా రాసే మీడియాలు కనిపించడం లేదు.

జగన్ సొంత ఛానల్, సొంత పత్రికలో అయితే.. ఆ పథకాలన్నీ ఆహో.. ఓహో అని డబ్బా కొడుతుంటాయి. ఇక జగన్ వ్యతిరేక ఛానళ్లయితే.. ఎంత మంచి పథకమైనా సరే.. అబ్బే.. ఏమాత్రం బాగాలేదు.. దుర్వినియోగం అవుతోంది.. అంటూ ఎక్కడలేని వంకలు పెడుతుంటారు. అలాంటిదే ఇప్పుడు జగనన్న ఇళ్ల కాలనీల విషయంలో జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 లక్షల మందికి సొంత ఇళ్లు కట్టివ్వాలని సీఎం జగన్ జగనన్న ఇళ్ల కాలనీ పథకానికి శ్రీకారం చుట్టారు.

అలా ఇచ్చే సొమ్ములన్నీ జగన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదు.. కేంద్రం నుంచి కూడా వచ్చే డబ్బులు కలిపే ఇస్తున్నారు.. అయితే.. లబ్ది దారులకు ప్రభుత్వ స్థలంలోనే ఇళ్లు కట్టుకునే అవకాశం ఇస్తున్నారు. అంటే ఇంటి స్థలం ఉచితం అన్నమాట. గతంలో ప్రభుత్వాలు ... ఇల్లు సొంత జాగాల్లో కట్టించాయి తప్ప.. ఇలా స్థలంతో పాటు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు జగన్ ఇల్లు కట్టుకునేందుకు దాదాపు 2 లక్షల నగదు ఇస్తున్నారు.

వీటితో పాటు కొంత సిమెంట్, ఇసుక, స్టీల్‌ కూడా అందిస్తున్నారు. అయితే.. ఆ సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం కుదరదు.. కచ్చితంగా లబ్ది దారుడు మళ్లీ చేతి నుంచి 2,3 లక్షల వరకూ పెట్టుకోవాల్సిందే. అయితే.. 2,3 లక్షలు పెట్టుకుంటే ఉచితంగా జాగాలో సొంత ఇల్లు ఇవ్వడం కూడా సామాన్యమైన విషయం కాదు.. కానీ ఇప్పుడు కొన్ని మీడియాలు ఈ పథకంలోనూ బొక్కలు వెదికే పని ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: