యువత ఆగ్రహాన్ని కేంద్రం, రాష్ట్రాలు గుర్తించలేకపోయాయా?

కేంద్రం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్‌ కార్యక్రమంపై విమర్శలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగ యువత ఆవేశాన్ని, ఆలోచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించలేకపోయాయని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోతే యువత శక్తి సామర్ధ్యాలు నిర్వీర్యం అవుతాయన్న కోదండరామ్‌.. కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ పరీక్షను వాయిదా వేస్తూ వచ్చిందని గుర్తు చేశారు.

కేంద్రానికి అర్ధం కావాలనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద యువకులు ఆందోళన చేపట్టారని.. ఆగ్రహంతోనే యువకులు ఆందోళన చేపట్టారని.. హింస జరిగినప్పుడు బల ప్రయోగం జరగాలని కోదండరామ్ అన్నారు. నిరుద్యోగ సమస్యను గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ఉపయోగించకుండా... ఎట్లా ఫైరింగ్ చేస్తారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ప్రశ్నించారు.

జరిగిన పరిణామాలపై న్యాయ విచారణ చేపట్టాలని.. సిట్టింగ్ హైకోర్టు జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తామన్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్... అగ్నిపథ్ పనికిరానిదన్నారు. అగ్నిపథ్ సుశిక్షితులైన సైనికులను తయారు చేయదని.. ఫించన్లు వంటివి తప్పించుకోవడానికే అగ్నిపథ్ ను కేంద్రం తీసుకువచ్చిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్ విమర్శించారు.

తక్షణమే అగ్నిపథ్ ను ఉప సంహరించుకోవాలన్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్.. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆందోళన చేప్పట్టిన యువకులపై కేసులు పెట్టి వేధించవద్దని సూచించారు. కుట్ర సిద్ధాంతాన్ని పక్కన బెట్టి ప్రభుత్వం యువకుల ఆగ్రహాన్ని గుర్తించాలని.. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని దీన్ని రాజకీయంగా మల్చుకోవడాన్ని ఆపాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: