అసలేం జరిగింది? : ఒక్క గ్రూప్‌ 1.. ఎన్నో ప్రశ్నలు?

ఏపీలో గ్రూప్‌ వన్‌ ఉద్యోగాల ఫలితాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. అక్రమాలపై పోరాటం సాగిస్తామని అభ్యర్థులు అంటున్నారు. వారు నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసిన ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్ణయం వల్ల భవిష్యత్తు కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు  ఆవేదన వ్యక్తం చేశారు. వారు అడిగిన అనేక ప్రశ్నల్లో న్యాయం కనిపిస్తోంది.

వారు ఏమంటున్నారంటే.. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలెలా మారతాయి..? జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణం ఏమిటి..? అధికారులు మారిన తర్వాత ఆచరణ,  నిర్వహణ తీరు మారిపోయిందని  గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. 202 మందిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించారని  గ్రూప్-1 అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు.

గతంలో సిద్దం చేసిన ఫలితాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్న  గ్రూప్-1 అభ్యర్థులు.. 55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారని ప్రశ్నిస్తున్నారు. హడావుడి ఇంటర్వ్యూల వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని  గ్రూప్-1 అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఈ ఫలితాలు నిలిపేసి అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు సెలవుల సమయంలో ఇలా ఎందుకు చేస్తున్నారని  గ్రూప్-1 అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

గతంలో సీతారామాంజనేయులు ఉన్న సమయంలో రూల్ ప్రకారం జరిగిందని.. కొత్త అధికారులు వచ్చాక కొత్త వారిని ఎంపిక చేశారని  గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు. డిజిటల్ ఇవాల్యూషనులో అంతా పారదర్శకతగానే జరిగిందంటున్న  గ్రూప్-1 అభ్యర్థులు.. ఇప్పుడు అభ్యర్థులనే మార్చి మాకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. అర్హత లేనివారిని అడ్డ దారుల్లో ఎంపిక చేస్తున్నారని  గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సీబీఐతో విచారణ చేయించి  202 మందికి న్యాయం చేయాలని  గ్రూప్-1 అభ్యర్థులు కోరుతున్నారు. తమ వాదనలు విన్న గవర్నర్‌.. పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని  గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు. మరి చివరకు ఏం చేస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: