ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకోవడం కరెక్టేనా?

పెళ్లంటే ఆడా మగా మాత్రమే చేసుకోవాలనే రూల్‌ను ఇటీవల చాలా మంది బ్రేక్‌ చేస్తున్నారు. ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు ఆడాళ్లు పెళ్లి చేసుకోవడం వంటి వింతలు కూడా తరచుగానే జరుగుతున్నాయి. తాజాగ మహిళల క్రికెట్లో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కేథరిన్‌ బ్రంట్‌, నటాలియా సీవర్‌ పెళ్లితో ఒక్కటయ్యారు. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు కెప్టెన్‌ హెదర్‌ నైట్‌, డానీ వ్యాట్‌, ఇషా గుహ, జెన్నీ గన్‌ వంటి వారు హాజరయ్యారు. వీరితో పాటు మరికొందరు తాజా, మాజీ ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్లు కూడా వీరి పెళ్లికి హాజరై.. ఆశీర్వదించారు.

ఇక తాజాగా పెళ్లి చేసుకున్న కేథరీన్‌, సీవర్‌ ట్రాక్ రికార్డు చూస్తే..   2017లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టులో వీరిద్దరూ సభ్యులే. ఇంగ్లాండ్‌ రన్నరప్‌గా నిలిచిన ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లోనూ ఈ ఇద్దరూ ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. 2019 అక్టోబర్‌లోనే వీరిద్దరూ తమ పెళ్లి వార్తను లోకాని చెప్పేశారు. వాస్తవానికి 2020 సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నా కరోనా వల్ల కుదలేదు.

ఇక ఇప్పటికే న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్‌, తహుహు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే దక్షిణాఫ్రికా క్రికెటర్లు మరిజేన్‌ కాప్‌, డాన్‌ నీకెర్క్‌ కూడా పెళ్లాడారు. అయితే ఇలా స్వలింగులు పెళ్లి చేసుకోవడంపై సమాజంలో విమర్శలు ఉన్నా.. వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరూ కాదనే పరిస్థితి లేదు. పైగా ఆధునిక కాలంలో ఇలాంటి విభిన్న పోకడలు కూడా ఓ భాగం అన్న అభిప్రాయం స్థిరపడుతోంది.

గతంలో ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. ఇద్దరు ఇండియన్‌ ఆరిజన్‌ కుర్రాళ్లు అమెరికాలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. లైంగిక స్వేచ్ఛ అన్నది వ్యక్తిగత హక్కుగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు సాధారణంగానే తీసుకోవాలి. ఎవరి ఇష్టం వారిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: