ఆ కమ్మ మంత్రి ని షేక్ చేస్తున్న సీట్ల దందా?
అయితే.. ఇప్పుడు ఈ ఆరోపణలు రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు ఇబ్బంది కరంగా మారాయి. ఎందుకంటే.. పువ్వాడ అజయ్ కు స్వయంగా ఓ ఆస్పత్రి ఉంది. పీజీ వైద్య సీట్లు తాను బ్లాక్ చేసినట్లు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తన కాలేజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసరడం కూడా ఆసక్తి రేపింది. ఒకవేళ రేవంత్ రెడ్డి నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి తన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి పువ్వాడ హెచ్చరించారు. పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేస్తున్నామంటూ గవర్నర్కు రేవంత్ రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని పువ్వాడ అంటున్నారు. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయంటున్నారు. అసలు పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ సమయంలోనే తమ కాలేజీలో సీట్లన్నీ నిండిపోతాయంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదంటున్నారు పువ్వాడ అజయ్. అయితే.. పీజీ మెడికల్ సీట్ల ప్రవేశాలదందా ఆరోపణలపై గవర్నర్ తమిళిసై.. పలువురు అభ్యర్థులతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు తమ సమస్యల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.