జ‌గ‌న్ ఈ ఒక్క ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చెపితే నువ్వు గ్రేటే...!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు సీఎం జ‌గ‌న్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. భారీ సంఖ్య‌లో ఎంపీల‌ను ఇస్తే.. ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న చెప్పారు. అయితే.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వా త‌.. ఈ విష‌యంపై అనేక పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న పార్టీల‌కు బ‌లం ఎక్కువ‌గా ఉంద‌ని.. దీంతో ఇప్పుడు ఏమీ చేయ‌లేమ‌ని.. ప్లీజ్ ప్లీజ్ అని అన‌డ‌మే చేయ‌గ‌ల‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను ప్ర‌తిసారి ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు.. ఇదే విష యం మాట్లాడుతున్నాన‌ని.. త‌న నాయ‌కులతో పీఎం జ‌గ‌న్ చెప్పిస్తున్నారు. దీంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు.. జ‌గ‌న్ ఏదో చేస్తార ని ఇప్ప‌టికీ ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రోసారి జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ల‌ను క‌లుసుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యం వెలుగు చూసిన త‌ర్వాత‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంలో ఆశ‌లు మ‌రోసారి చిగురించాయి. ``సీఎం జ‌గ‌న్ ఈసారైనా సాధిస్తారా? `` అంటూ.. వారు ప్ర‌శ్నించుకుంటున్నారు. నెటిజ‌న్లు కూడా ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఖ‌చ్చితంగా హోదాపై ఏదో ఒకటి సాధిస్తార‌ని.. వారు కూడా ఆశ‌లు పెట్టుకున్న ట్టు చెబుతున్నారు. దీనికి ప్ర‌దానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి.

పెట్టుబ‌డులు రావాలి. ప్రైవేటు కంపెనీలు కూడా రావాలి. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం. ఎందుకంటే.. ప్ర‌భుత్వ ద‌గ్గ‌ర రాయితీలు ప్ర‌క‌టించేందుకు ఏమీలేదు. అందుకే.. హోదాపై కేంద్రాన్ని ఒప్పిస్తే.. ఇక‌, ఏపీకి పెట్టుబ‌డులు వ‌స్తాయి. ఇదీ.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం చెబుతున్న మాట‌. అదేస‌మ‌యంలో రెండో విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. మ‌రో రెండేళ్ల‌లోనే ఎన్నికలు వున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ రికార్డు స్థాయిలో ఏం చేశారు?  సంచ‌ల‌న అంశాన్ని దేన్ని సాధించారు? అనేది కూడా వీరిమ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌ర‌చి చూసుకుంటే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌, సంక్షేమ ప‌థ‌కాలు , తాజాగా చేసిన జిల్లాల విభ‌జ‌న. ఇంత‌కు మించి.. ఏమీ జ‌ర‌గ‌లేదు.

ఈ నేప‌థ్యంలో త‌ను ఇది సాధించాను.. అని చెప్పుకొనేందుకు అయినా.. జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావిస్తార‌ని.. కేంద్రం నుంచి సాధిస్తార‌ని.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం చెబుతోంది. ఎందుకంటే.. దీనికి కూడా మ‌రో కీల‌క కార‌ణం ఉంద‌ని అంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న‌వారు.. ఆర్థికంగా ల‌బ్ధి పొందుతున్న వారు.. జ‌గ‌న్‌కు ఓటేసే అవ‌కాశం ఉంది. మ‌రి ఇవి అంద‌ని వారిని జ‌గ‌న్ ఎలా మ‌చ్చిక చేసుకోవాలి?  త‌న‌వైపు ఎలా తిప్పుకోవాలి? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గానికి ఉపాధి, ఉద్యోగాలు వ‌చ్చేందుకు పెట్టుబ‌డులు వ‌చ్చి పారిశ్రామికంగా రాష్ట్రం డెవ‌ల‌ప్ అయ్యేందుకు ఉన్న ఏకైక మాత్రం.. ప్ర‌త్యేక హోదానే. అందుకే.. వారు ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లార‌ని తెలియ‌గానే ప్ర‌త్యేక హోదా ఈ సారైనా తెచ్చేస్తారా ? అంటూ.. చ‌ర్చించుకుంటున్నారు. ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌న్ నుంచి ఎస్ అన్న ఆన్స‌ర్ వ‌స్తే ఖ‌చ్చితంగా మ‌న‌ద‌రం జ‌గ‌న్‌ను గ్రేట్ అనాల్సింందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: