ఆ వైసీపీ మహిళా నేతకు ఇదే లాస్ట్ ఛాన్స్... తొక్కేస్తున్నారా...!
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అర్హులందరికీ అందేలా చూస్తున్నారు. స్వయంగా కూడా స్వచ్ఛంద సేవను చేస్తున్నారు. ఇక, అసెంబ్లీలోనే కాకుండా.. బయట కూడా.. జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టీడీపీని కార్నర్ చేస్తూ.. తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్ని చేసేదీ.. ఆమె ఒక్కసారైనా.. మంత్రి అని అనిపించుకునేందుకే! గత మంత్రి వర్గ ఏర్పాటు సమయంలోనే తనకు మంత్రి పదవి ఖాయమని ఆమె బలంగా నమ్మారు. అయితే.. రెడ్డి ట్యాగ్ కారణమో..లేక ఆమె దూకుడే కారణమో.. తెలియదుకానీ.. పదవి మాత్రందక్కలేదు.
ఇక, ఇప్పుడు జరుగుతున్న మంత్రి వర్గ ప్రక్షాళనలో అయినా.. తనకు అవకాశం ఇవ్వాలని.. ఆమె జగన్‌కు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. మరి ఇప్పుడైనా..ఆ మె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. అయి తే.. ఒకవేళ ఆమెకు ఇప్పుడు కూడా మంత్రివర్గంలో చోటు లభించకపోతే.. ఇక, ఎప్పటికీ.. ఆమె మంత్రి కాలేరని.. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని.. ఓ వర్గం ప్రచారం చేస్తోంది.
ఇక్కడ కేజే కుమార్ పెద్దిరెడ్డి వర్గంగా ఉన్నారు. ఈయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని.. మంత్రి పెద్దిరెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారట. దీంతో వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదని అంటున్నారు. ఈ నేపథ్యంలో అయితే.. ఇప్పుడే ఆమె మంత్రి అవ్వాలని.. ఇప్పుడు కనుక ఆమెకు ఛాన్స్ దక్కకపోతే.. ఇక, ఎప్పటికీ.. ఆమె మంత్రి అయ్యే అవకాశం లేదని.. నియోజకవర్గంలో వైసీపీ నేతలు గుసగుస లాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో... రోజా ఆశలు ఎప్పుడు తీరుతాయో చూడాలని అంటున్నారు పరిశీలకులు.