వైసీపీ దారిలో టీడీపీ..సక్సెస్ ఫార్ములా అదేనా.. ?

VUYYURU SUBHASH
పార్టీలు వేరైనా రాజకీయం ఒకటే..గతంలో ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏం చేసిందో...ఇప్పుడు టీడీపీ అదే ఫార్ములాతో ముందుకెళుతుంది...ముల్లుని ముల్లుతోనే తీయాలనే విధంగా టీడీపీ రాజకీయం నడుపుతుంది..టీడీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతి విషయంపై రాద్ధాంతం చేసేది..అలాగే అసెంబ్లీలో ఏ స్థాయిలో రచ్చ లేపేదో చెప్పాల్సిన పని లేదు...ఏదోకవిధంగా టీడీపీని ఇరుకున పెట్టడానికి చూసేది...అలాగే అసెంబ్లీని సైతం బహిష్కరించి రాజకీయం చేసింది...అలా చేయడం వల్లే వైసీపీ ఇంకా సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా అదే రూట్‌లో వెళుతుంది...వైసీపీని ఎక్కడకక్కడ ఇరుకున పెట్టడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుంది..కాకపోతే వైసీపీ చేస్తున్న తప్పులనే టీడీపీ ఎత్తిచూపుతూ ముందుకెళుతుంది...ప్రభుత్వం తప్పులపైనే పోరాడుతుంది...వైసీపీ మాదిరిగా లేనిపోనివి క్రియేట్ చేసి రాజకీయం చేయడం లేదు.ఉన్న సమస్యలపైనే గళం విప్పుతుంది..ఇటీవల కల్తీ సారా మరణాలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది..ఈ అంశంపై అసెంబ్లీలో గట్టిగానే పోరాడుతుంది..అసెంబ్లీని స్తంభించే స్థాయిలో టీడీపీ పోరాడుతుంది.
అయితే టీడీపీ ఎమ్మెల్యేలు తక్కువ మందే కాబట్టి..స్పీకర్ వారిని సస్పెండ్ చేసి బయటకు పంపించి సభని నడిపించేస్తుంది. సస్పెండ్ అయి బయటకొచ్చిన సరే టీడీపీ ఎమ్మెల్యేలు తగ్గడం లేదు..తమదైన శైలిలో పోరాటం చేస్తూనే ఉంది..అటు మండలిలో సైతం ఎమ్మెల్సీలు దూకుడుగా ఉన్నారు. మామూలుగా ఎమ్మెల్సీలు పెద్దగా హైలైట్ అవ్వరు..కానీ టీడీపీ ఎమ్మెల్సీలు అలా కాదు.మండలిలో వైసీపీని ఎక్కడకక్కడ ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అలాగే లోకేశ్ సైతం ఇప్పుడు చాలా వరకు టీడీపీని లీడ్ చేస్తున్నారు.
గతం మాదిరిగా కాకుండా ఇప్పుడు పవర్ ఫుల్ పంచ్‌లతో వైసీపీపై విరుచుకుపడుతున్నారు...మండలిలో మంత్రులకు సైతం ధీటుగా సమాధానాలు చెబుతున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ ఎటాక్ చేస్తూనే ఉంది...ఇక ఎక్కువ మంది ఉన్నా సరే పెద్దగా డిఫెండ్ చేసుకోలేని పొజిషన్‌లో వైసీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే గతంలో వైసీపీ మాదిరిగానే ఇప్పుడు టీడీపీ ఎటాకింగ్ పాలిటిక్స్ చేస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: