80 శాతం జగన్‌తోనే...వైసీపీ బొక్క బోర్లా ప‌డడం ఖాయ‌మైందా ?

VUYYURU SUBHASH
ఏపీలో ఇంకా ప్రజలు జగన్ వైపే ఉన్నారా? గత ఎన్నికల్లో ఓట్లు వేసిన వారు ఇప్పటికీ జగన్‌కు అండగానే ఉన్నారా? అబ్బే లేరు కదా అని చెప్పేయొచ్చు..అప్పుడు వైసీపీకి ఓట్లు వేసిన వారంతా ఇప్పుడు కూడా సేమ్ లేరు..చాలామంది జగన్ ప్రభుత్వానికి యాంటీగా మారిపోయారు..ఇందులో ఎలాంటి అనుమానం లేదనే చెప్పొచ్చు. కానీ అధికార వైసీపీ నేతలు గాని, శ్రేణులు గాని అలా ఫీల్ కావడం లేదు. ఇంకా ప్రజలంతా తమవైపే ఉన్నారని అనుకుంటున్నారు..అసలు తమకు ఇంకా తిరుగులేదనే భావిస్తున్నారు...
అసలు 30 ఏళ్ల వరకు జగనే సీఎంగా ఉంటారని వైసీపీ నేతలు భజన చేసేస్తున్నారు. తాజాగా కూడా ఇప్పటికీ 80 శాతం ప్రజలు జగన్‌తోనే ఉన్నారని చెబుతున్నారు..మరి వైసీపీ నేతలు చెబుతున్నట్లు 80 శాతం ప్రజలు జగన్ వైపే ఉన్నారా? అంటే ఏ మాత్రం లేరనే చెప్పొచ్చు...చంద్రబాబుతో పోలిస్తే కాస్త జగన్‌కు సపోర్ట్ ఉండొచ్చు ఏమో గాని...80 శాతం మద్ధతు మాత్రం లేదనే చెప్పొచ్చు..కానీ వైసీపీ నేతలు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నారు తప్ప...అందులో రియాలిటీ కనిపించడం లేదు.
అయితే సేమ్ వైసీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో..2019 ఎన్నికల ముందు టీడీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ నేతలు కూడా అలాగే మాట్లాడారు. అసలు తమకు ప్రజల మద్ధతు ఉందని, తమ పాలన పట్ల 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పి హడావిడి చేశారు..అలా హడావిడి చేస్తే చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే..2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు..ప్రజల మద్ధతు చంద్రబాబుకు పెద్దగా లేదని అర్ధమైంది.
సేమ్ చంద్రబాబు మాదిరిగానే ఇప్పుడు జగన్ కూడా ముందుకెళుతున్నారు..అసలు ప్రజలంతా తమ వైపే ఉన్నారని, ఇంకా జీవితాంతం తామే అధికారంలోనే ఉంటామనే ఫీలింగ్ లో వైసీపీ నేతలు ఉంటున్నారు. ఇక ఇలాగే ముందుకెళితే...వైసీపీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వెళ్ళి టీడీపీకి మంచి ఛాన్స్ ఇచ్చేలా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: