ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. చకచకా పరిణామాలు..?

ఊహించినట్టే జరిగింది.. అమెరికా కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్న యుద్ధం రానే వచ్చింది. ఉక్రెయిన్ దేశంపై పొరుగున ఉన్న పెద్ద దేశం రష్యా యుద్ధం ప్రారంభింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై మిలటరీ యాక్షన్ చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది. ఇప్పటికే రష్యా మిస్సైళ్లు ఉక్రెయిన్ రాజధాని వైపు దూసుకెళ్తున్నాయి. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులు దాటి చొచ్చుకుపోతున్నాయి.

రష్యా సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రష్యా ఉల్లంఘించిందని అమెరికా మండిపడింది. రష్యా చర్యలపై కలసి కట్టుగా నిర్ణయించి ముందుకెళ్తామని ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రకటించింది.
 
రష్యా తక్షణమే సైనికచర్యను ఆపాలని.. ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని అమెరికా హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి వేదికగా రష్యా చర్చలకు రావాలని అమెరికా ప్రతిపాదించింది. రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాలు గమనిస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు జో బెడైన్.. దీనిపై చర్చించేందుకు రేపు జి-7 దేశాలతో సమావేశం అవుతున్నట్టు ప్రకటించారు. రష్యాపై చర్యల విషయంలో తాము నాటో కూటమికి సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

రష్యా అధ్యక్షుడి విషయంలో తాము ముందు నుంచే హెచ్చరిస్తున్నామని.. పుతిన్ ముందస్తుగా నిర్ణయించుకునే ఉక్రెయిన్‌ తో యుద్ధానికి దిగారని జో బైడెన్‌ ఆరోపించారు. రష్యా తీసుకున్న సైనిక చర్య నిర్ణయం వల్ల తీవ్రమైన విపత్తు కలుగు తుందని.. ఇది మానవాళి నష్టానికి దారి తీస్తుందని  బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఇండియాలోని భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే 1,300 పాయింట్లకు పైగా నష్టపోయాయి. మరి రష్యా తీసుకున్న నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: