బీజేపీ విషయంలో వైసీపీ మౌనం మొదటికే మోసం వస్తుందా...!
అదేసమయంలో ఏపీ ప్రభుత్వంపై.. బీజేపీ అధినేత సోము వీర్రాజు గురి పెడుతున్నారు. తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇక, ఇతర నాయకులు జీవీఎల్ వంటివారు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటి కి.. వైసీపీ నుంచి.. స్పందన లభించడం లేదు. నిజానికి రాజకీయాల్లోతమను విభేదించినవారికి సరైన కౌంటర్ ఇస్తుంటారు. కానీ.. ఏపీలో మాత్రం ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బీజేపీపై వైసీపీ ఎందుకు ఇంత మౌనంగా ఉంటోందనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు.. బీజేపీ దూకుడు పెరిగేందు కు.. దోహద పడుతున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరో వైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా.. బీజేపీపై ఒక్కమాట కూడా అనడంలేదు. ఎందుకు అనాలి? అని ప్రశ్నిస్తే.. టీడీపీని కూడా బీజేపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సోము ఎక్కడ మాట్లాడి నా... టీడీపీని కూడా వదిలి పెట్టడం లేదు. అయినప్పటికీ.. టీడీపీ నుంచికూడా ఎలాంటి రెస్పాన్స్ ఉండ డం లేదు. దీంతో అసలు బీజేపీ విషయంలో రెండు కీలక పార్టీలూ అనుసరిస్తున్న విధానం ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కీలకంగా మారుతుందని భావిస్తున్నారా?
లేక.. కేంద్రంతో ఉన్న బంధాలు తొలిగిపోతాయని ఆలోచిస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా.. రెండు ప్రధాన పార్టీ ల నుంచి కూడా బీజేపీపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇక, ఆ పార్టీకి తిరుగులేదనే వాదన వినిపిస్తోంది. మరో వైపు ఆ పార్టీ నాయకులు కూడా అదే రీతిలో రెచ్చిపోతుండడం గమనార్హం.