ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ అప్పాయింట్ ఇవ్వ‌న‌ని చెప్పేశారా...!

VUYYURU SUBHASH
ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యే. పైగా.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో మంచి పేరున్న నాయ‌కుడు. అయినాకూడా ఆయ న‌కు సీఎం జ‌గ‌న్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదా?  క‌నీసం ఆయ‌న గురించి ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు క‌డ‌ప జిల్లా రాజంపేట  నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు. దీనికి కారణం.. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం.. జిల్లాల పున‌ర్విభ‌జ‌న చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మ‌లో క‌డ‌ప జిల్లాను వైఎస్సార్ జిల్లా గాను, అన్న‌మ‌య్య జిల్లాగాను విభ‌జించాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. అన్న‌మ‌య్య జిల్లాను ఆహ్వానిస్తు న్నప్ప‌టికీ.. జిల్లా కేంద్రంగా రాయ‌చోటి కాకుండా.. రాజంపేటను చేయాల‌ని ఇక్క‌డి వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇత‌ర ప్ర‌తిప‌క్ష నేత‌ల కంటే కూడా అధికార పార్టీకి చెందిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి.. కుటుం బం కూడా ఆందోళ‌న‌కు రెడీ అయింది. విద్యార్థి సంఘాల నాయ‌కుల‌తో క‌లిసి .. ఇత‌ర ప్ర‌తిప‌క్ష నాయ‌కు లతో క‌లిసి ఉద్య‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేగా ఉన్న మేడాపై తీవ్ర ఒత్తిడి పడింద‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలో ఇక్క‌డి ప‌రిస్తితిని సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించాల‌ని మేడా నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఆయ న‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని.. మేడా సోద‌రుడు వ‌రుస అయ్యే విజ‌య‌శేఖ‌ర‌రెడ్డి చెబుతు న్నారు. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు.

రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌ని.. బ్రిటీష్ పాల‌నే న‌యం అంటూ.. మేడా విజ‌య‌శేఖ‌ర‌రెడ్డి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లుచేశారు. దీంతో ఇప్పుడు మేడాకు పూర్తిగా సీఎం ద‌గ్గ‌ర గేట్లు మూసుక‌పోయాయ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. ప‌రిష్క‌రించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పైగా.. ఈ నెల 26 వ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే.. అభ్య‌ర్థ‌న‌న‌ల‌ను.. అభిప్రాయాల‌ను, అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తామ‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. అధికారంలో ఉండి కూడా రోడ్డెక్క‌డాన్ని సీఎం సీరియ‌స్‌గానే భావిస్తున్నారు. పైగా.. త‌న సొంత జిల్లాలోనే ఇంత యాగీ చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగానే ప‌రిగ‌ణిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే మేడాకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. మేడా వ‌ర్గం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇటు సీఎం జ‌గ‌న్‌పైనా.. అటురా జంపేట ఎంపీ.. మిథున్ రెడ్డిపైనా విరుచుకుప‌డుతున్నారు. క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రాలు ఇచ్చారు. మ‌రి అధికారంలో ఉన్న నాయ‌కులే ఇలా రోడ్డున ప‌డి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అని ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు. త‌ప్పులు మీరుచేస్తూ.. సీఎం అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని అన‌డం స‌మంజ‌స‌మేనా? అంటున్నారు. దేనికైనా సంయ‌మ‌నం.. పాటించాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: