
జగన్.. ఆ హర్యానా మోడల్ ఫాలో అయితే బెటర్..?
ఇప్పుడు ఏపీలో ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. ప్రత్యేకించి సచివాలయ ఉద్యోగుల కోసం ప్రభుత్వం బయో మెట్రిక్ వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే .. మనిషి స్వయంగా వేలు ముద్ర వేస్తే తప్ప ఆఫీసుకు వచ్చినట్టు అటెండన్స్ లభించదు. అయితే.. ఈ టెక్నాలజీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బయోమెట్రిక్ మెషీన్లు సరిగా పని చేయడం లేదు. కొన్నిసార్లు హాజరును సరిగ్గా నమోదు చేయడం లేదు. తన హాజరు పడిందో తెదో తెలుసుకునే అవకాశం లేదు. ఇలా మొత్తానికి బయోమెట్రిక్ హాజరు గందరగోళంగా మారింది.
అయితే ప్రభుత్వం మాత్రం తాము బయోమెట్రిక్ పెట్టేశాం కాబట్టి.. ఇక ఆబ్సెంట్ పడితే జీతం కోసేస్తామని చెబుతోంది. ఈ కారణంగా కొందరు ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి కూడా బయో మెట్రిక్ నమోదు కాకపోవడం వల్ల జీతం కోల్పోయిన ఉదాహరణలు కూడా చాలా ఉంటున్నాయి. అందుకే ఈ విషయంలో హర్యానా మోడల్ ఉపయోగించుకోవడం మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు. ఇంతకీ ఈ హర్యానా మోడల్ ఏంటి అనుకుంటున్నారా.. అక్కడ బయోమెట్రిక్‌తో పాటు ఉద్యోగి జీపీఎస్ ట్రాకింగ్ ఫెసిలిటీని కూడా కల్పించారు.
ఈ జీపీఎస్ ట్రాకింగ్ వల్ల.. ఉద్యోగి ఏ సమయానికి ఎక్కడు వెళ్లాడన్న సమాచారం పక్కగా ఉంటుంది. ఉద్యోగుల కదలికలు కచ్చితంగా నమోదవుతాయి. ఏపీలోనూ హర్యానా తరహా విధానం పెట్టాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో..?