సండే ఈవెనింగ్స్ : ఒత్తిడే లేని ఏకాంతాలు
దసరా పండుగ వచ్చి వెళ్లింది. పండుగ కానీ సంబంధిత సంతోషం కానీ ఇంకా చెప్పాలంటే సంబంధిత క్షణాలు కానీ ఏదయినా, ఏ వయినా వచ్చే వెళ్తాయి. మనం వాటిని దాచుకుంటున్నామా లేదా విడిచి పెడుతున్నామా అన్నది గుర్తు పెట్టుకోవాలి. మనుషు ల్లో విశ్వాసాలు, అభిప్రాయాలు కూడా వచ్చే వెళ్తుంటాయి.
మోస్ట్ వెల్కమింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా! దానిని మాత్రం గు ర్తుకు ఉంచుకుని మిగతావన్నీ వదిలేయాలి. వారం రోజు ల ఒత్తిళ్లు, వారం కాలం మోసిన ఏవో ఇబ్బందులు కొన్ని పేజీలకు అప్ప గించి పోవడంలో అర్థం ఉంది. సాహిత్య సంబంధ అర్థం అ న్నది మానసిక ఉద్వేగానికి సంబంధించి ఉంటే మేలు. సామాజిక ఉద్వే గాలు కూడా గడిచిన వారం ఇచ్చిపోయింది. కనుక సా మాజిక ఉద్వేగాలను సాహిత్యం అర్థంచేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తే చే స్తుంది. అది అవసరార్థం చేస్తుందా లేదా అన్నది వేరే విషయం.
ఎవరికి వారు కొన్ని బలమైన ఉద్వేగాలతోనే జీవించాలి. ఒకటి రద్దయితే ఇంకొకటి వచ్చి నెత్తిపై వాలుతుంది కనుక బాధ, దుఃఖం మనకూ మన చుట్టూ ఉన్నవారికే ఒకేలా ఉండవు. ఉంటే అవి ఉద్వేగాలు కావు. సందర్భ సహిత సమస్యలూ కావు. ఆదివారం సాయంత్రాలు వారం రోజుల పాటు నిర్ణయించుకుని చేసే పనులకు ముగింపు ఇవ్వవు. కానీ కొన్నింట మాత్రం ఉపశమనం అందిం చిపోతాయి. ఆదివారం సాయంత్రాలు కొన్ని కొందరికి ఖరీదుగా ఉంటాయి. కొందరికి మార్మిక సౌందర్యాలను అందించిపోతాయి. దే నిని అందుకున్నామో అది మనకు చెందిదే అయి ఉండాలి. మనకు సంబం ధం లేకుండా ఇతరులకు చెందిన ఉద్వేగాలు మన వి కావు. మన వల్ల పుట్టిన ఉద్వేగాలు అన్నీ మనవి మరియు ఇతరులవీ! కనుక సామాజిక ఉద్వేగాలు, ఉద్దేశాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అవి మారుతున్న ప్రతిసారీ సంఘంపై, సంఘటనలపై పుట్టే మంచో, చెడో అభిప్రాయం మాత్రం నీదై ఉండా లి అన్నది స్పష్టమయిన నా నిర్దేశిక.
- రత్నకిశోర్ శంభుమహంతి