ఆర్.ఎస్.ఎస్ కు గ్రీన్ సిగ్నల్ ! ?

ఆర్.ఎస్.ఎస్ కు గ్రీన్ సిగ్నల్ !  ?


ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  (ఆర్.ఎస్.ఎస్)  కార్యకలాపాల్లో పాల్గోనవచ్చని హర్యానా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో 2016   సర్విస్ రూల్స్ లో ఈ మేరకు  సవరణలు చేసింది.  హర్యానాలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ  చర్యలను అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 

హర్యానా రాష్ట్రంలో అదికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం తాజాగా రెండు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్న వారు ఎటువంటి రాజకీయ కార్యక్రమాలలోనూ పాల్గోనరాదని గతంలో ఉత్తర్వులు ఉండేవి. వాటితో బాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) కారక్యకలాపాల లోనూ పాల్గోన కూడదని స్పష్టమైన అదేశాలున్నాయి. ఈ రెండు ఉత్తర్వులు 1967, 1980లలో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చాయి. తాజాాగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్  నాటి ఉత్తర్వులను స్థానంలో  మరలా ఉత్తర్వులు ఇచ్చారు.  ప్రభుత్వ ఉత్తర్వు 2016 ను విడదల చేశారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల పై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ భగ్గు మనింది. రాష్ట్రంలో జరుగుతున్నది  పరిపాలననా ? లేక బి.జె.పి - ఆర్.ఎస్.ఎస్ పాఠశాల ? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
హర్యానా సివిల్ సర్వీసేస్ (ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి) రూల్ 2016 నిబంధనలు, అంటే మే 2,1980తో పాటు అంతకు ముందు 1967 జనవరి 11నుంచి అమలు లో ఉన్న ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కితీసుకుంది. సదరు ఉత్తర్వులు ఇంక ఎంత మాత్రమా అవి అమలు కావు అని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో హర్యానా ప్రభుత్వ ఉద్యోగులు ఇక పై నేరుగా ఆర్.ఎస్.ఎస్ కార్యకలాపాల్లో పాల్గోనవచ్చని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తెలిపారు. ఈ ఉత్తర్వు పై కాంగ్రెస్ పార్టీ  ధీటైన సమాధానం చెప్పింది.
ఈ ఉత్తర్వలను బట్టి హర్యానా ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై నేరుగా మత తత్వకార్యకలాపాల్లో పాల్గోనే అవకాశం కలిగింది అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
1980లో హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్న వారు ఎవరూ  రాజకీయ పార్టీలతో కాని, ఆర్.ఎస్.ఎస్ తో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సంబంధాలు కలిగి ఉండరాదు. అంతకు ముందు... అంటే1967లో ఇచ్చిన ఉత్తర్వుల లోనూ ఇదే అంశాన్ని పేర్కోన్నారు. ఆర్.ఎస్.ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గోంటే సదరు వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఆ ఉత్తర్వులోని సర్వీసు నిబందనలు వెల్లడిస్తున్నాయి. తాజా  హర్యానా ముఖ్యమంత్రి మనోహరా లాల్ ఆ రెండు ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు తాజా గా ఉత్తర్వులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rss

సంబంధిత వార్తలు: