రాజు వచ్చినాడు : ఆంధ్రా కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తే !

RATNA KISHORE

సుదీర్ఘ కాలం రాజకీయంలో తడబాటులో ఉంది. సుదీర్ఘ కాలం రాజకీయ రంగంలో వెనుకబాటులో ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ ఏదో ఒక రూపాన తన అస్తిత్వం నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. ఈ క్రమంలో భాగంగా కొత్త  శక్తులను కొన్నిం టిని నమ్ముకునేందుకు తన వాదం బలపర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్థికంగా పెద్దగా లేని కారణంగా ప్రభుత్వ వ్యతిరేక కా ర్యకలాపాలు చేపట్టలేకున్నా వ్యవస్థాగత నిర్మాణానికి మాత్రం ముందుగా ప్రత్యేక శ్రద్ధ అయితే చూపుతోంది. పార్టీ విధేయులకు  ప్రాధాన్యం పెంచితే తాము అనుకున్న విధంగా వచ్చే ఎన్నికలకు వీరంతా సిద్ధం అయి, క్యాడర్ ను రూపొందించుకుని కాస్తో  కూ స్తో మైలేజీ దక్కించుకుని తీరుతారని భావిస్తోంది. అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగాల్లోనూ కొత్త శక్తిని నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

శ్రీకాకుళంలాంటి ప్రాంతాలలో యువజన కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ వీరికి దశా దిశనూ ఇచ్చే నాయకులు కర వవుతున్నారు. ఇదే పరిస్థితి కాంగ్రెస్ అభిమానుల్లో చాలా మందిలో ఉంది. తాము పార్టీకి పనిచేయాలని భావించినా సరైన ప్రో త్సాహం లేని కార ణంగా వెనుకంజలో ఉంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతటినీ వైసీపీ తనవైపు తిప్పు కున్నందున మళ్లీ పూర్వ తేజం రావాలంటే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వీర విధేయులు విధుల్లోకి వస్తేనే సాధ్యం అన్నది వారి అభి ప్రాయం. అలానే డీసీసీ అధ్యక్షులనూ మార్చాలన్న వాదన ఎప్పటి నుంచో ఉంది.

సీనియర్లను కాకుండా యువకులకు అవకాశం ఇస్తే బాగుంటుందన్నది కొందరి అభిప్రాయం. ఈ అభిప్రాయంతో అధిష్టానం ఏకీభ వించాల్సిన తరుణం రానే వచ్చింది. శ్రీకాకుళం వరకే తీసుకుంటే ఇక్కడి డీసీసీ చీఫ్ బొడ్డేపల్లి సత్యవతి (మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు.  ప్రెస్మీట్ల నిర్వహణకు కూడా  ఆమె తన సమయం కేటాయించడం లేదు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీలకు అధ్యక్షులు, తగిన విధంగా కార్యాలయాలు ఉన్నా కూడా ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం ఒకటి చేయలేకపోతున్నారు. వాస్తవానికి సీనియర్ నాయకులు కొందరు వైసీపీ వైపు ఇ ష్టం లేకుండానే వెళ్లినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పై మొగ్గు మాత్రం అలానే ఉంది. వారంతా పార్టీకి విధేయులుగా ఉన్నవారే! తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలో కూడా నాయకత్వ మార్పు వీలున్నంత త్వరగా చేపడితే వీరంతా కాం గ్రెస్ గూటికి  చేరడం ఖాయం.

కాంగిరేసు పార్టీ రేసు గుర్రం వెతుకులాటలో ఉంది. తన మాట వినే వారికే ఈ సారి పగ్గాలు. గతంలోనూ ఇలానే ఇచ్చింది అనుకోం డి. రాజశేఖర్ రెడ్డి తరువాత సోనియా అదృష్టమో మరొకటో కానీ కాంగ్రెస్ లో మొండి మనుషులు లేరు. ఆ విధంగా బొత్స కానీ రఘు వీరా కానీ సోనియా ఏం చెబితే అదే అన్న విధంగానే నడుచుకుని తమ పని తాము చేసుకుపోయారు.  ఇప్పటికీ బొత్స పా ర్టీ విధేయతలో తీసిపోరు. తనకు జీవితాన్ని ఇచ్చిన రాజకీయంగా ఎదుగుదలను ఇచ్చిన కాంగ్రెస్ ను ఒక్క మాట కూడా పలక రు. ఆయ నే కాదు ఆయనను నమ్మిన బంటు బండ్ల గణేశ్ కూడా ఇదే విధంగా నడుచుకుంటారు. ఇక రఘువీరాను ఉద్దేశించి అ యితే వీర వి ధేయుడు అని రాయడం కరెక్టు. ఏనాడూ గీత దాటడు ఆయన. కొందరు కాంగ్రెస్ నుంచి వెళ్లరు వెళ్లినా వెనక్కు వ చ్చి తమ పని తాము చేసుకుంటారు అనేందుకు సాకే శైలజా నాథ్ కానీ kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఉంటారు. సాకే శైలజా నా థ్ త్వరలో జగన్ వెంట నడుస్తారు అన్నది క్లియర్. కానీ ఇప్పటికింకా ఆయన ఏ క్లారిటీ ఇవ్వకున్నా రేపటి వేళ జరిగేదే ఇది. ఇక కొత్త బాస్ kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని తెలుస్తోంది. చాలా కాలం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఈ చిత్తూరు పెద్దాయన త్వరలో ఆంధ్రా కాం గ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కు పగ్గాలు చేపడతారు. స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఇదే చక్కని అవకాశం అని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: