ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

RATNA KISHORE
ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



దేశం ఫ‌స్టు

ప‌త‌కం ఫ‌స్టు

గెలుపు ఫ‌స్టు

ఈశాన్యం అన్నింటా

ఫ‌స్టు..




త‌గిన ప్రోత్సాహం

త‌గినంత భ‌రోసా

కాలికి త‌గిలిన‌న్ని గాయాలు

ఒంటికి త‌గిలిన‌న్ని గాయాలు

అన్నీ ఒర్చుకుంటే ప‌త‌కం ఫ‌స్ట్

గాయం నెక్ట్స్.. బాధ‌లూ నెక్ట్స్

బాక్సర్ ల‌వ్లీనా జీవితం ఇది




నాన్న సంతోషంగా ఒక మాట చెప్పాడు! నీదే ప‌త‌కం అని ఎలా చెప్పావ్ ... ల‌వ్లీనా.. నీకు జ్యోతిషం ఏమ‌యినా తెలుసా. ప‌తకంతో వ‌స్తాన‌న్న ధీమా ఎలా వ‌చ్చింది.. నాన్నకు వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట.. వాట్ ఎ గ్రేట్ వ‌ర్డ్..ప‌త‌కం ఈ సారి నాతోనే అని ఎలా చెప్ప‌గ‌లిగావ్!ఈ రోజు నా బిడ్డ కోసం ఊరు ఊరంతా ప్రార్థ‌న‌లు చేస్తుంది. కొంద‌ర‌యితే ఆల‌యాల‌కు సైతం వెళ్లారు..అని చెబుతున్నారు..ల‌వ్లీనా నాన్న..దేశం అంటే ఇప్పుడు మ‌ట్టి-మ‌ నిషి-ప్రార్థ‌న - ప‌త‌ కం- ఇలా కొన్నింటిని విడ‌దీయ‌క క‌లిపి ఉంచితే దేశం సంబంధిత భ‌క్తి వాటికి ఉన్న అర్థం అన్నీ అర్థం అవుతాయి.




"ఆరంభానికి అర్థం ముగియడంతో కాదు మ‌రో కొత్త ఆరంభానికి ఏదో ఒక దారి వెత‌క‌నివ్వ‌డం" దేశం అంటే అప్పుడప్పుడూ గుర్తుకువ‌చ్చే ఈశాన్య రాష్ట్రాలు కూడా అని మ‌న నాయ‌కులు తెలుసుకుంటారా..ఈ నాల్రోజుల హాడా వుడి త‌రువాత ఈశాన్యం గురించి మ‌రిచే పోతారు.ఈశాన్యం అంటే పాగా వేసేందుకు సిద్ధ‌ప‌డిన రాజ‌కీయ పార్టీల‌కు ఒక కేంద్ర స్థా వ‌రం కావొచ్చు కానీ ఈశాన్యం అంటే ఇవాళ ప్ర‌పంచం నెత్తిన పెట్టుకుంటున్న ప్రాంతం. కానీ ఈశాన్యం నుంచి వ‌చ్చిన బిడ్డ‌లకు ఆ పాటి గౌర‌వం ఉందా..ఇప్పుడు బాక్సర్ ల‌వ్లీనా మొన్న మీరాబాయి చాను..ఇలా ఒక్క‌రేంటి ఎంద‌రో! ఈశాన్యం త‌రువాత మ‌ళ్లీ పరుగులు అంటే ఒడిశా గుర్తుకు వ‌స్తుంది. ద్యుతీచంద్ లాంటి క్రీడాకారిణిలు గుర్తుకువ‌స్తారు.కానీ వీళ్లంద‌రికీ ప‌త‌కమే ఫ‌స్ట్ కానీ నాయ‌కుల‌కు రాజ‌కీయ‌మే ఫ‌స్ట్. భ్ర‌ష్ట‌త్వం అల్పత్వం అని రెండు ఉంటాయి. ఈ రెండూ దాటి నాయ‌కులు ఉండ‌లేరు. ఉండ‌రు కూడా!





దిక్కులు కొన్ని చుక్క‌లు కొన్ని ..

చుక్కుల క‌లిపాక తేలిన రోజులు కొన్ని..

ముగిసిన రోజులు కొన్ని రోజూ ఇలానే ఉంటుందా..



క‌రోనా కార‌ణంగా ప్రాక్టీసు లేదు.ఈ బాధ పీవీ సింధూ మొద‌లుకుని ల‌వ్లీనా వ‌ర‌కూ వెన్నాడింది.ఇంకా ఇంకొంద‌రిని వెన్నాడుతూ నే ఉంది.ప్రాక్టీసు స‌రే డ‌బ్బులు ఎలా వ‌స్తాయి..అంత కాలం ఎలా జీవితం నెట్టుకురావాలి అన్న సందేహాలూ ఉన్నాయి. బాక్స‌ర్ ల వ్లీనా జీవితం ఇంకొంత భారం.అమ్మ క‌రోనా బారిన ప‌డితే ద‌గ్గ‌రుండి చూసుకోవాలి.త‌రువాతే సాధ‌నే త‌రువాతే ప‌త‌కం.కానీ నాన్న‌కు ఓకే ఒక్క మాట చెప్పింది.నేను గెలిచివ‌స్తాన‌ని..చెప్పి మ‌రీ! వెళ్లింది..ఇదిగో సెమీస్ పోరు..త‌రువాత ఆనంద‌మే ఆనం దం. ఆనందాల‌ను అవధిగా అందించిన విజ‌యాల‌ను మ‌నం స్మ‌రించుకుంటే..కొన్ని రోజులు ఈ క‌రోనా ఇచ్చిన నిరాశ నుంచి బ‌య‌టప‌డ‌డం సులువు.నిరాశ‌లు ఇంటి గుమ్మం ముందు త‌చ్చాడ‌తాయి..వాటిని పంప‌లేం.ఈ ప‌త‌కం అలాంటి మ‌హ‌మ్మారు ల‌ను పంపుతుంది అని ఆశిద్దాం.ఈ రోజు సెమీస్ లో ల‌వ్లీనా గ్రామంలో అంతా పూజ‌లు చేస్తున్నారు అని విన్నాను.దిస్పూర్ లో పూజ‌లు..అసోంలో పూజ‌లు.. ప్రార్థించండి..ఇంకాస్త మార్పు దేశంలోనూ..ప‌త‌కాల సాధ‌న‌లోనూ త‌ప్ప‌క‌వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: