హెరాల్డ్ ఎడిటోరియల్ : స్వామి దెబ్బకు ఎల్లోమీడియా జుట్టు పీక్కుంటోందా ?

Vijaya
సుబ్రమణ్యంస్వామి ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగానే ఉంటారు. ఆయన ఏమి మాట్లాడినా వార్తే..ఏమీ మాట్లాడకపోయినా వార్తే. ఇపుడు తాజా విషయం ఏమిటంటే ఎల్లోమీడియాలో తిరుమల పవిత్రతకు భంగకరంగా వచ్చిన వార్తపై సుబ్రమణ్యంస్వామి సదరు మీడియాపై రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. నిజానికి ఈ వార్త వచ్చింది ఇపుడు కాదు అప్పుడెప్పుడో అంటే దాదాపు ఏడాదిన్నర క్రితం. ఏడాదిన్నర క్రితం రాసిన వార్తపై స్వామి ఇపుడు పరువునష్టం కేసు వేయటమేంటో ఎవరికీ అర్ధం కావటంలేదు. స్వామి వెనుక ఎవరున్నారో కూడా సక్రమంగా అర్ధం కావటంలేదు. కాకపోతే సహజంగానే ఈ సీనియర్ ఎంపి కేసు వేయటం వెనుక జగన్మోహన్ రెడ్డే ఉన్నారంటూ కతలు అల్లేస్తున్నారు.


ఇపుడు స్వామి వేసిన కేసు కారణంగా చాలామంది జుట్లు పీక్కుంటున్నారు. అసలు స్వామి ఎల్లోమీడియాపై ఇంతకాలం తర్వాత ఎందుకు కేసు వేశారో బీజేపీ నేతలకు అర్ధం కావటంలేదు. ఇదే విషయమై తెలుగుదేశంపార్టీ నేతలు కూడా చాలా ఆలోచించి ఏమీ తేలక మాట్లాడకుండా కూర్చున్నారు. ఇక ఎల్లోమీడియాకు అయితే మరీ తిక్కరేగిపోతోంది. తమపై స్వామి పరువునష్టం దావా వేయటంపై రెండు రోజులుగా వరుసగా కథనాలు రాసుకుంటోంది. కోర్టుల్లో కూడా వేయనన్ని ప్రశ్నలను ఎల్లోమీడియా స్వామిపై సంధిస్తోంది. అయితే స్వామి మాత్రం కామ్ గా తిరుపతికి వెళ్ళి కేసు ఫైల్ చేశారు. తర్వాత అమరావతికి వెళ్ళి జగన్ తో భేటీ అయ్యారు. అంతే స్పీడుగా తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు.


వెళ్ళిన స్వామి ఊరికేపోకుండా తాను పరువునష్టం దావా వేసిన విషయాన్ని వివరించారు. పైగా తాను వేసిన కేసుల్లో ఇఫ్పటివరకు ఒక్కటి కూడా ఓడిపోలేదని చెప్పి మరీ ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఈ మాట వాస్తవమే అయ్యుంటుంది. అందుకనే ఎల్లోమీడియా యాజమాన్యం కూడా మల్లగుల్లాలు పడిపోతోంది. స్వామి అంటేనే దేశ రాజకీయాల్లో తెలియని వాళ్ళుండరు. ఎంతటి తెలివైన వారు కాకపోతే ఎన్నెన్నో కేసుల్లో లిటిగేషన్ పెట్టేసి సోనియాగాంధి, రాహూల్ గాంధి లాంటి బడా బడా నేతలను ముప్పు తిప్పలు పెట్టారు. మొత్తానికి ఆలస్యంగా కేసు వేసిన లేటెస్టుగానే వచ్చినట్లు చెప్పుకున్నారు. మరి చూద్దాం ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: