హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

Vijaya
ఆదివారం ఆంధ్రజ్యోతి చదివిన వాళ్ళకు ఇదే అనుమానం వచ్చుంటుంది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి మీద బుర్రకు తోచిందంతా రాసేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు, కథనాలు, చెత్తపలుకులో రాసిందంతా తిరిగి టీడీపీకే రివర్సు కొడుతోందని అర్ధమైనట్లుంది. అందుకనే ఏమి చేయాలో దిక్కుతోచని స్దితిలో ఇక జగన్ ఇంట్లోనే కుంపట్లు పెట్టాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే జగన్ కు సోదరి షర్మిలకు ఏమాత్రం పడటం లేదని రాశారు. జగన్ మీద కోపంతో షర్మిల తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టబోతున్నారట. తెలంగాణాకు సీఎంను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పటం వల్లే జగన్ అంటే షర్మిలకు మండిపోతోందట. కాబట్టి అర్జంటుగా ఫిబ్రవరిలోనే రాజకీయపార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించబోతున్నారట. ఆమెకు తల్లి విజయలక్ష్మి మద్దతు కూడా ఉందట.



అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే రాధాకృష్ణలోని తప్పుడు ఆలోచనలు బయటపడుతున్నాయి. అదేమిటంటే జగన్ పై కోపంతో షర్మిల పార్టీ పెడితే అదేదో ఏపిలోనే పెట్టాలి కానీ తెలంగాణాలో పెట్టడం ఏమిటి ? తెలంగాణాలో షర్మిల పార్టీ పెడితే  జగన్ కు ఏమి నష్టం ? తెలంగాణాకు షర్మిలను సీఎం చేయటం జగన్ చేతిలో ఉందా ? బుర్రలో ఏకాస్త గుజ్జున్న వాళ్ళయినా దీన్ని ఒప్పుకుంటారా ? షర్మిలను ఏపిలో ఎంపిగా చేయటం జగన్ చేతిలో పని. అంతేకానీ పక్క రాష్ట్రానికి సీఎం చేస్తానని జగన్ హామీ ఇవ్వటం ఏమిటి ? దాన్ని షర్మిల నమ్మటం ఏమిటి ? తాను రాసే రాతలను జనాలు నమ్ముతారా లేదా అనే విషయమై రాధాకృష్ణకు ఇఫ్పటికే ఓ క్లారిటి వచ్చేసినట్లుంది. అందుకనే బుర్రకు తోచింది నాలుగు గోడల మధ్య కూర్చుని ఏదో ఒకటి రాసేస్తున్నారు.



ఆమధ్య ఇదే ఆంధ్రజ్యోతిలో మొదటిపేజీలో బ్యానర్ గా ఓ కథనం వచ్చింది. అదేమిటంటే షర్మిలతో  జగనే తెలంగాణాలో ఓ రాజకీయపార్టీ పెట్టిస్తున్నాడని.  తెలంగాణాలో ఉన్న రాజకీయశూన్యతను భర్తీ చేయటం కోసమే జగన్ సోదరితో పార్టీ పెట్టిస్తున్నాడని అప్పుడు రాసింది నిజమా ? లేకపోతే ఇపుడు జగన్ పై కోపంతో షర్మిల పార్టీ పెట్టబోతోందని రాసింది నిజమా ? పైగా షర్మిల పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసి సోనియాగాంధి పొత్తుకు ప్రయత్నించినట్లు రాయటం భలే క్యామిడీగా ఉంది. మొత్తానికి జగన్ కుటుంబంలో  చీలికల కోసం ఎల్లోమీడియా లేకపోతే చంద్రబాబు ఇదీ కాకపోతే చంద్రబాబు రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ లాంటి వాళ్ళు ఎవరో ప్రయత్నాలు మొదలుపెట్టినట్లే ఉంది. ఎదుటివాళ్ళు నోరిప్పనంత కాలం ఎల్లోమీడియాలో ఇలాంటి పిచ్చిరాతలు వస్తునే ఉంటాయి. మనం చదివి ఎంజాయ్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: