ఎడిటోరియల్ : జాకీలు లేపుతున్న బాబు ... లోకేష్ సక్సెస్ అవుతాడా ?

టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ను రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి తీసుకువచ్చేందుకు తన శక్తికి మించి గట్టిగానే కష్టపడుతున్నారు. లోకేష్ తీరుపై పార్టీ శ్రేణులు ఎవరిలోనూ సదభిప్రాయం లేకపోవడంతో ఆయన కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుంది అనే అభిప్రాయం ఏర్పడడం, దీనికి తగ్గట్టుగానే లోకేష్ పనితీరు అంతంతమాత్రంగానే వుండటం వంటి వ్యవహారాన్ని బేరీజు వేసుకుంటున్న చంద్రబాబు ఇలా అయితే, తన తర్వాత తన వారసుడిగా నారా లోకేష్ ను ప్రకటించినా , పార్టీలో అసంతృప్తి పెరిగిపోయి, అది మొదటికే మోసం రావచ్చు అనే అభిప్రాయం బాబు లోనూ కలుగుతోంది. అందుకే అందుకే పార్టీలో లోకేష్  ప్రాధాన్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 



దీనిలో భాగంగానే పార్టీ అనుబంధ కమిటీల విషయంలో లోకేష్ ద్వారానే మీటింగులు పెట్టించి, వార్నింగులు ఇప్పించడం వంటివి చేస్తూ కాస్త హడావుడి చేస్తున్నారు. పటిష్టతకు మీ వంతు సహకారం అందిస్తే, మీకు అన్ని విధాలుగా తాను సహకరిస్తాను అంటూ లోకేష్ ద్వారా పదేపదే చెప్పించడం వెనక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. లోకేష్ దృష్టిలో పడితే తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదు అనే నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లో కలిగించి, రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి అనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే తాను యాక్టివ్ గా ఉన్న సమయంలోనే లోకేష్ కు పార్టీలో పరపతి పెరిగే విధంగా అన్ని రకాలుగానూ బాబు సెట్ చేస్తున్నారు. పార్టీ కమిటీ లలోనూ, లోకేష్ కు అన్ని రకాలుగానూ సహకరించే వారికి పెద్దపీట వేయడం ఇవన్నీ దానిలో భాగంగానే కనిపిస్తోంది. 



ఇప్పటిి వరకూ లోకేష్ ఇంటికే పరిమితం అయ్యారు కానీ,  అదే పనిగా లోకేష్ పై  వైసిపి నాయకులు విమర్శలు చేస్తుండడంతో , అమరావతికి వచ్చేందుకు చంద్రబాబు కు అయినా తీరిక ఉంటుంది కానీ, లోకేష్ కు మాత్రం అసలు తీరిక లేదని, ఇటువంటి వారు  రాజకీయాలకు    అవసరమా అంటూ పదేపదే వైసిపి నాయకులు కొంతమంది విమర్శలు చేస్తున్న వ్యవహారాలను సీరియస్  గా తీసుకున్నన బాబు లోకేష్  ప్రాధాన్యం పార్టీలో పెంచకపోతే ,  మరింతగా డ్యామేజ్ అవ్వాల్సి వస్తుందనే భయంతో, ఇప్పుడు అమరావతి లో పర్యటిస్తూ, హడావుడి చేశారు. అంతేకాదు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ , వార్నింగులు , భరోసా లు  ఇస్తూ ఇక పార్టీలో తనదేే పెత్తనం  అన్నట్టుగాా హడావుడి చేస్తున్నాారు ఈ వరుస చూస్తే, త్వరలోనే లోకేష్ కు  పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు.



 లోకేష్ ను ఏదో ఒకరకంగా బలమైన నాయకుడిగా నిరూపించేందుకు చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకూ బాబు ప్లాన్ బాగానేే ఉన్నాా, అది వర్కవుట్ అవుతుందో లేదో అనేది ఆ పార్టీ నేతల్లోనూ అనేక సందేహాలు కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: