హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ కుటుంబానిదే అరుదైన రికార్డు..ఎల్లోబ్యాచ్ కు నోరు లేవటం లేదా ?

Vijaya
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డికి అరుదైన అదృష్టం దక్కింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం అందరికీ దక్కదు. ఇటువంటి మహత్తరమైన అదృష్టం వైఎస్ కుటుంబానికి దక్కింది. మనదేశంలో తండ్రి, కొడుకులు ముఖ్యమంత్రులైన రాష్ట్రాలున్నాయి. తండ్రి, కొడుకులు ముఖ్యమంత్రలుగా చేయటం అరుదైన విషయమే అయినా ఒడిస్సా, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఉదాహరణలున్నాయి. అయితే ఏపిలో మాత్రం ఇప్పటివరకు లేదనే చెప్పాలి. సమైక్య రాష్ట్రాన్ని చాలామందే పరిపాలించారు. టంగుటూరు ప్రకాశంపంతులు మొదలుపెట్టి నిన్నటి చంద్రబాబునాయుడు వరకు తీసుకుంటే సుమారు 20 మంది ముఖ్యమంత్రులుగా చేశారు.



ఈ 20 మందిని తీసుకుంటే వైఎస్సార్+జగన్ తప్ప తండ్రి, కొడుకులు సిఎంలుగా మరే ఫ్యామిలీలోను కాలేదు. మహాఅయితే మంత్రులయ్యారు, ఎంఎల్ఏలు, ఎంపిలుగా పనిచేశారు.  కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కొడుకు శిశిధర్ రెడ్డి మంత్రిగా చేశాడు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రయితే కొడుకు కాసు కృష్ణారెడ్డి మంత్రిగా పనిచేశాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తే కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్రంలో మంత్రయ్యాడు. అలాగే జలగం వెంగళరావు సిఎం అయితే ఇద్దరు కొడుకుల్లో ప్రసాదరావు మంత్రిగా చేస్తే రెండో కొడుకు జలగం వెంకట్రావు ఎంఎల్ఏగా పనిచేశాడు.



ఎవరిని తీసుకున్నా కేంద్రంలోనో లేకపోతే రాష్ట్రంలోనో మంత్రులయ్యారంతే. అయితే ముఖ్యమంత్రులుగా మాత్రం ఎవరు కాలేకపోయారు. ఆ అవకాశం ఒక్క వైఎస్ కుటుంబానికి మాత్రమే దక్కింది. అందుకనే తాజాగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జగన్ వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించగానే వైసిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్+జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఫొటోలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. పైగా ఈసారి డిక్లరేషన్ అనే వివాదాన్ని ప్రతిపక్షాలు+ఎల్లోమీడియా బాగా రచ్చ చేయటం కూడా జగన్ పట్టువస్త్రాలు సమర్పించే ఘట్టానికి ప్రాధాన్యత తెచ్చిపెట్టింది. ప్రతిపక్షాలు కానీ ఎల్లోమీడియా కానీ ఈ విషయాన్ని లేవనెత్తకుండా, పట్టించుకోకుండా ఉంటే సిఎం పట్టువస్త్రాలు సమర్పించే అంశం పెద్దగా హైలైట్ అయ్యేదికాదు.



మొత్తానికి చంద్రబాబు, ఎల్లోమీడియా జగన్ పై బురద చల్లుదామని చేసిన ప్రయత్నం చివరకు తుస్సుమన్నది. తిరుమలకు చేరుకున్న జగన్ ఆలయం దగ్గరకు రావటమే నుదుటన తిరునామం, పంచుకట్టుతో జనాలకు కనబడగానే అప్పటి వరకు రేగిన వివాదం మొత్తం గాలికి కొట్టుకుపోయింది. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత గురడసేవలో కూడా జగన్ పాల్గొన్నారు. అలాగే గురువారం ఉదయం జరిగిన సుందరకాండ పారాయణంలో కూడా చాలా ఓపిగ్గా పాల్గొన్నాడు. దాంతో జగన్ అన్యమతస్తుడు, క్రిస్తియన్ అనే ముద్ర వేసేందుకు చంద్రబాబు, ఎల్లోమీడియా చేసిన ప్రయత్నాలన్నీ  ఫెయిలైపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: