జ‌గ‌న్‌ను... వైఎస్సార్‌సీపీని బద్నాం చేయ‌డ‌మే టార్గెట్‌.... ఎంత‌కు దిగ‌జారారంటే...!

VUYYURU SUBHASH

విష‌యం ఉందా?  లేదా? అనేది ప‌క్క‌న పెట్టు.. జ‌గ‌న్ పైనా.. ఆయ‌న బృందంపైనా ఎంత వ‌ర‌కు అవ‌కాశం ఉంటే.. అంత‌వ‌ర‌కు రాళ్లేద్దాం!- ఇదీ ఇప్పుడు ఎల్లో మీడియా స్ట‌యిల్‌.. స్కెచ్ కూడా!  దీంతో ప‌స ఉన్నా లేకున్నా.. జ‌గ‌న్ స‌ర్కారుపైనా.. ఆయ‌న ఎమ్మెల్యేల‌పైనా.. విమ‌ర్శ‌ల బండ‌లు ప‌డేస్తోంది. ఈ క్ర‌మంలోనే వీళ్లు ఎంత‌కు అయినా దిగ‌జారుతున్నారు. తాజాగా.. గుంటూరు జిల్లాకు చెందిన తూర్పు ఎమ్మెల్యే ముస్త‌ఫా వ్య‌వ‌హారాన్ని తీసుకుంటే.. ఆయ‌న‌కు చెందిన గిడ్డంగుల్లో నిషేధిత గుట్కా పొట్లాల త‌యారీ జ‌రుగుతోంద‌ని ఎల్లో మీడియా అరిచి గీపెట్టింది!!

 

మొత్తంగా గుట్కా వ్య‌వ‌హారాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేకు ముడిపెట్టి.. దీనిని రాజ‌కీయం చేయ‌డం ద్వారా అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా.. ఇంతే అనే ఒక దుష్ప్ర‌చారాన్ని తీసుకురావాల‌ని ఎల్లో మీడియా ప్ర‌య‌త్నం. ఇదే విష‌యంలో వాస్త‌వం చూస్తే.. స‌ద‌రు గిడ్డంగులు ఎమ్మెల్యేవే! ఈ విష‌యాన్ని ఆయ‌నే ఒప్పుకొన్నారు. అయితే, తాను 2017లోనేవీటిని కొంద‌రికి లీజుకు ఇచ్చేశాన‌ని, వాటితో త‌న‌కు యాజ‌మాన్య సంబంధాలే త‌ప్ప‌.. వ్యాపార సంబంధాలు లేవ‌ని చెప్పుకొచ్చారు.

 

వాస్త‌వానికి గుంటూరు అర్బ‌న్ ఎస్పీ కూడా ఇదే చెప్పారు. గిడ్డంగులు ఎమ్మెల్యేవే అయిన‌ప్ప‌టికీ.. వ్యాపారంతో మాత్రం ఆయ‌న‌కు సంబంధం లేద‌ని చెప్పారు. ఇక‌, ఇక్క‌డ భారీ ఎత్తున గుట్కా త‌యారు అవుతున్న మాట వాస్త‌వమే. కానీ, దీనిని పాన్ మ‌సాలా కోసం లీజుకు తీసుకుని అక్ర‌మంగా త‌యారు చేస్తున్న గుట్కాను అంత‌ర్రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. దీనిని పోలీసులు గుర్తించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఎల్లో మీడియా మాత్రం.. వైఎస్సార్ సీపీ నేత‌ల‌ను ఎంత అవ‌కాశం ఉంటే.. అంత బ‌ద్నాం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకుంది.

 

ఇలా ఎల్లో మీడియా చేస్తున్న టార్గెట్ల‌పై సోష‌ల్ మీడియాలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. `ఇంత క‌క్ష సాధింపు` అవ‌స‌ర‌మా? అని కామెంట్లుకూడా కురుస్తున్నాయి. ఇదే ప‌రిస్థితి టీడీపీ నేత‌ల‌కు ఎదురైతే.. అప్ప‌ట్లో ఏం చేశారు? ఇలానే రాశారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. కృష్ణాజిల్లా కైక‌లూరులో ప్ర‌త్యేకంగా శిబిరాల‌ను ఏర్పాటు చేసి.. పేకాట‌లు ఆడించిన అప్ప‌టి ఏలూరు ఎంపీ మాగంటి బాబు విష‌యం వెలుగు చూస్తే.. క‌నీసం మాట‌మాత్రంగా కూడా ప్ర‌చురించ‌లేదు.. క‌దా! ఇదేనే.. పాత్రికేయ నీతి? అని నిల‌దీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: