హెరాల్డ్ ఎడిటోరియల్: బాబు మీడియాలో వైఎస్ ఒక్కసారిగా హీరో అయ్యారే...!
మాయదారి మల్లిగాడు!- సినిమా చూశారా? అందులో హీరోగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ ఓ పాట పాడతా డు.. బతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు.. నువ్వు చచ్చాక ఏడుస్తారు దొంగనాయాళ్లు! అని అంటాడు. అచ్చు .. ఏపీ పాలిటిక్స్ కూడా ఇలానే తయారయ్యాయని అంటున్నారు విశ్లేషకులు., ఉమ్మడి ఏపీని ఐదున్నర సంవత్సరాలు (రమారమి) పాలించి అన్ని వర్గాలకు చేరువైన అపర భగీరధుడు, ప్రజల మనిషి..వైఎస్ రాజశేఖరరెడ్డి.. తన వినూత్న పాలనతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఆయన తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయి.
ముఖ్యంగా వైఎస్‌ను అనుసరించిన పలు రాష్ట్రాలుఇక్కడ అమలైన, అవుతున్న ఆరోగ్య శ్రీని ఆయా రాష్ట్రా ల్లోనూ అమలు చేస్తున్నాయి. అలాంటి నాయకుడు బతికి ఉండగా ఏనాడూ ఒక్కమాటైనా పొగడని.. టీడీపీ నాయకులు, ఆ పార్టీకి భజన చేయడంలో ఆరితేరిపోయిన మీడియా కూడా ఇప్పుడు మాత్రం వైఎస్ ను కీర్తిం చడం చూస్తే.. ప్రతి ఒక్కరికీ మాయదారి మల్లిగాడు సాంగే గుర్తుకు వచ్చింది. శాసన మండలి రద్దు చేస్తూ.. జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.
అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించ దని, ఇది కేవలం జగన్ ఆర్భాటమే తప్ప.. ఏమీ జరగదని నిన్న మొన్నటి వరకు ఊదరగొట్టిన టీడీపీ, బాబు అనుకూల మీడియా హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నాయి. కేంద్రం సానుకూలంగానేఉందని, జగన్ ప్రభుత్వ పరిధిలోని అంశంలో వేలు పెట్టేది లేదని తెలుసుకు న్నాకో ఏమో.. ఒక్కసారిగా సెంటిమెంటును తెరమీదికి తెచ్చి.. జగన్‌ను ఇరుకున పెట్టేందుకు టీడీపీ, అను కూల మీడియా కూడా ప్రయత్నించాయి.
అదిగో.. అప్పట్లో.. మీ నాన్నగారు.. ఎంతో కష్టపడి.. నిద్రాహా రాలు కూడా మానేసి, రద్దయిన మండలిని తీసుకువచ్చారు. ఇప్పుడు నువ్వు రద్దు చేస్తే.. ఆయన ఆత్మ క్షోభించదా! అంటూ కొత్తపల్లవి అందుకున్నాయి.అంతేకాదు, పుంఖాను పుంఖాలుగా అప్పటి వైఎస్ కృషిని అచ్చోశాయి. ఇవి చదవినవారు.. చూసినవారు.. నిజంగా వైఎస్‌పై ఇంత ప్రేమ ఉందా? అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. కానీ, ఏ ఎండకు ఆగొడుగు పట్టే.. పరిస్తితి ఉన్న నేటి రోజుల్లో.. జగన్‌ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా నేడు వైఎస్‌ను వాడుకుంటున్నారనేది అక్షర సత్యం అంటున్నారు పరిశీలకులు. ఈ నక్క వినయాలు ఎవరు నమ్ముతారు? అని ఎదురుకూడా ప్రశ్నిస్తున్నారు.