రాటుదేలుతున్న రాహుల్‌.. మోదీకి కష్టమే?

రాహుల్ గాంధీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పద్ధతిని అనుసరిస్తున్నారని చాలామంది రాజకీయ నిపుణులు అంటున్నట్లుగా తెలుస్తుంది. 2014 ముందు చంద్రబాబు నాయుడు అనుసరించిన పద్ధతిని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అనుసరిస్తున్నారట. అప్పుడు చంద్రబాబు నాయుడు సస్పెన్స్ అంటూ ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు. ఉద్యోగంలో అలసత్వః చూపించే వాళ్ళని, అలాగే ఉద్యోగ నిర్లక్ష్యం చేసే వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించేవారు.

అసలు ఒకే ఒక్కడు సినిమా కూడా తన పద్ధతిని బట్టే తీశారు అన్నట్లుగా చెప్పుకొచ్చారట ఆయన గతంలో. అప్పట్లో ఆయన ఎన్టీఆర్ ని జనాలు మర్చిపోవాలని చెప్పి జన్మభూమి, శ్రమదానం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. అయినా కూడా అప్పుడు 2004 ఎలక్షన్లో పరాజయం పాలయ్యారు. అయితే అలాంటి పి ఆర్ టీమే ఇప్పుడు రాహుల్ కి కూడా పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటున్నారు కొంతమంది.

వాళ్లు ఇలా ఎందుకు అంటున్నారు అంటే ఆయన పాదయాత్ర, అందర్నీ కలుపుకుంటూ పోవడం, అలాగే ఉచితాలని అనౌన్స్ చేయడం ఇలాంటివన్నీ ఆయన తరహాలోనే ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా తాజాగా ఆయన ఒక రాత్రి ట్రక్కులో ప్రయాణించారు అంట. ఎందుకంటే ట్రక్కు డ్రైవర్ యొక్క బాధలు తెలుసుకుందామని ప్రయాణించారని అంటున్నారు. వాళ్ల బాధలను ఈయన ఏమి తీరుస్తారు.  ఒకవేళ ఈయన అధికారంలోకి వచ్చాక ఆయన డ్రైవర్ బదులు ఏమన్నా రోబోట్లను పెట్టి నడిపిస్తారా అని అడుగుతున్నారు.

ఒక రాజకీయ నాయకుడిగా అందరి బాధలు తెలుసుకోవడంలో తప్పులేదని అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ట్రక్కు డ్రైవరు బాధ ఏం తీరుస్తారని అంటున్నారు కొంతమంది. ఇంకో విషయం ఏంటంటే ఇలా ఆయన ప్రయాణం చేస్తున్నట్లు ప్రచారం చేయడం వల్ల ఏం ఉపయోగం ఉందని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఇలా సామాన్య జనాల్లో తిరుగుతూ వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఉంచుకుంటారని తెలుస్తుంది. ఈ అనుభవాన్ని అంతా, ఆయన సేకరించిన సమాచారాన్ని అంతా సరిగ్గా ఎలక్షన్లకు ముందు ఉపయోగిస్తారు అన్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: