ఆంధ్రా, తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైనట్టేగా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు వేరు వేరుగా జరుగుతాయి.  కేంద్ర ఎన్నికల సంఘం ప్రిఫరేషన్ ప్రారంభించింది. దాదాపు 9 రాష్ట్రాల ఎన్నికలకు పనులు స్టార్ట్ చేసింది. 2023 - 24 సంవత్సరాల్లో జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తులు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు జులై  17 తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే పార్టీలు డిసెంబర్ 12 తర్వాత దరఖాస్తులు చేసుకోవాలని కోరింది.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబర్ 17 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. వచ్చే ఏడాది కాలంలో తెలంగాణ, ఆంధ్ర, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఓరిస్సా ఎన్నికలు జరగనున్నాయని చెప్పింది. దీంతో పాటు లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 తో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు 2024 జూన్ 11తో ముగుస్తుంది. లోక్ సభ గడువు 2024 జూన్ 11 తో ముగుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.

ఒక వేళ ఏదైనా అసెంబ్లీ గనక ముందుగానే రద్దయితే ఆ రోజు నుంచి అయిదు రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.  తద్వారా భారత ఎన్నికల సంఘం తమ ప్రిపరేషన్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇండియాలో లోక్ సభ ఎన్నికలంటే పండగ వాతావరణం నెలకొన్నట్లే.. ముఖ్యంగా దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఆయా పార్టీలు ఇప్పటి నుంచే తమ సన్నద్ధత ప్రారంభిస్తాయి.

కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ముందుకెలా వెళ్లాల్లో ఆలోచన చేస్తుంటాయి. కాబట్టి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ ఆరంభిస్తాయి. మరి రాబోయే ఎన్నికల్లో గెలిచెదెవరో.. అధికారం దక్కించుకునేదెవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: